Advertisementt

ఫైనల్లీ అమెరికాకి ఎన్టీఆర్

Mon 06th Mar 2023 09:51 AM
ntr,oscars  ఫైనల్లీ అమెరికాకి ఎన్టీఆర్
Finally NTR to America ఫైనల్లీ అమెరికాకి ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాలో జరిగిన HCA అవార్డ్స్ కోసం వ్యక్తిగత కారణాలతో వెళ్లకపోయేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ పడిన ఆందోళన అంతా ఇంతా కాదు. అసలు ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ ఉందో.. లేదో తెలుసుకోకుండా వారు చేసిన రచ్చ మాములుగా లేదు. అయితే ఎన్టీఆర్ తన సోదరుడు తారకరత్న మరణంతో అమెరికాకి వెళ్లలేకపోయాడు. కానీ ఇప్పుడు ఆస్కార్ కి కూడా ఎన్టీఆర్ అమెరికాకి వెళతాడా.. లేదా అనే దిగులుతో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు. అసలైతే మార్చ్ 5 ఆదివారమే ఎన్టీఆర్ అమెరికాకి వెళుతున్నాడని అన్నారు.

కానీ సోమవారం ఉదయం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికా ఫ్లైట్ ఎక్కేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ అందానినికి అవధులే లేవు. ఎన్టీఆర్ అమెరికాకి వెళుతున్నాడు. అక్కడ ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్ కనిపిస్తాడనే సంతోషం వాళ్ళని నిలవనియ్యడం లేదు. ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హమ్మయ్య ఫైనల్లీ ఎన్టీఆర్ అమెరికాకి అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఊపిరి తీసుకుంటున్నారు. లేదంటే గత నెల 25నుండి రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తుంటే ఇక్కడ ఎన్టీఆర్ ఫాన్స్ చాలా ఫీలయ్యారు.

రామ్ చరణ్ ఒక్కడే ఆర్.ఆర్.ఆర్ క్రెడిట్ కొట్టేస్తున్నాడు.. మా తారక్ అన్న మిస్ అవుతున్నాడనే వాళ్ళ బాధ మాములుగా లేదు. మరి ఎన్టీఆర్ అసలు అమెరికా ఎందుకు వెళ్ళలేదు.. తెలుసుకోకుండా వాళ్ళు అలా రచ్చ చెయ్యడం కరెక్ట్ కాదనేది చాలామంది అభిప్రాయం, అయినా వాళ్ళు వినలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ అమెరికాకి అనగానే కూల్ అవుతూ సంబరాల్లో మునిగిపోయారు. అసలు ఆస్కార్ నాటు నాటు సాంగ్ కి వస్తుందో.. లేదో కానీ.. ఎన్టీఆర్ అమెరికాకి వెళ్లడమే వాళ్ళకి ఆస్కార్ వచ్చినంత సంబరంగా ఉంది.

Finally NTR to America:

NTR heads to the US for the Oscars

Tags:   NTR, OSCARS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ