Advertisementt

ప్రాజెక్ట్ K సెట్స్ లో అమితాబ్ కి ప్రమాదం

Mon 06th Mar 2023 10:47 AM
amitabh bachchan,project k sets  ప్రాజెక్ట్ K సెట్స్ లో అమితాబ్ కి ప్రమాదం
Amitabh Bachchan injured on Project K sets ప్రాజెక్ట్ K సెట్స్ లో అమితాబ్ కి ప్రమాదం
Advertisement
Ads by CJ

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అమితాబచ్చన్, ప్రభాస్ తదితర కీలక నటులపై సన్నివేశాల చిత్రకరణ చేపట్టారు. అయితే ప్రాజెక్ట్ కే సెట్స్ లో బిగ్ బి అమితాబచ్చన్ కి ప్రమాదం జరగగా ఆయనని వెంటనే గచ్చిబౌలిలోని AIG కి తరలించినట్లుగా తెలిసి అయన అభిమానులు తీవ్ర ఆందోళన పడుతున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రాజెక్ట్ కే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా అమితాబ్ కి గాయాలు కాగా.. వెంటనే చిత్ర బృందం ఆయనని AIG కి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ ప్రమాదంలో అమితాబచ్చన్ పక్కటెముకలుకు గాయాలు అవ్వగా.. ఆయనని పరీక్షించిన వైద్యులు రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. AIG లో చికిత్స అనంతరం అమితాబ్ ముంబైకి వెళ్లిపోయారు.

అయితే తన హెల్త్ కండిషన్ బాగానే ఉంది, అభిమానులెవరూ ఆందోళన పడవద్దు, తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను, కొద్ది రోజుల్లో అంతా సెట్ అవుతుంది అంటూ అమితాబ్ సోషల్ మీడియా వేదికగా తన హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. దానితో ప్రాజెక్ట్ కే షూటింగ్ కొద్దిగా వాయిదాపడగా.. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ లేని సీన్స్ ని తెరకెక్కించే ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.

Amitabh Bachchan injured on Project K sets:

Amitabh Bachchan confirms rib injury on Project K sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ