Advertisementt

అందుకే షణ్ముఖ్ కి దూరంగా ఉంటున్నా: సిరి

Tue 07th Mar 2023 03:29 PM
siri,shanmukh-deepthi sunaia  అందుకే షణ్ముఖ్ కి దూరంగా ఉంటున్నా: సిరి
Siri on Shanmukh breakup అందుకే షణ్ముఖ్ కి దూరంగా ఉంటున్నా: సిరి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లో నెటిజెన్స్, బుల్లితెర ప్రేక్షకులు ముక్కున వేలేసుకునేలా చేసిన షణ్ముఖ్-సిరిలు హౌస్ నుండి బయటికి వచ్చాక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఒకరినొకరు విడిచి ఉండలేకుండా, ముద్దులు, హగ్గులతో ప్రేమికులు కూడా ఇలా ఉండరేమో అనిపించేంతగా రెచ్చిపోయి, దానికి ఫ్రెండ్ షిప్ అన్న పేరు పెట్టిన షణ్ముఖ్ - సిరిలని నెటిజెన్స్ హేట్ చేసారు. ఇక షణ్ముఖ్ ని ఆయన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన వదిలేసింది. సిరి ని కూడా శ్రీహన్ వదిలేసినంత పని చేసినా.. మళ్ళీ ఎలాగో వాళ్ళు కలిసిపోయారు. 

కానీ షణ్ముఖ్-సిరి హౌస్ నుండి బయటికి వచ్చాక అంతే స్నేహంగా, క్లోజ్ గా మూవీ అవుతారని చాలామంది ఎక్స్ పెక్ట్ చేసారు. కానీ వారెప్పుడూ కలిసి కనిపించింది లేదు. సిరి-షణ్ముఖ్ కలిసి ఒక్క ఈవెంట్ లోను పాల్గొనలేదు. తాజాగా సిరి.. షణ్ముఖ్ కి ఎందుకు దూరంగా ఉంటుందో చెప్పి షాకిచ్చింది. షణ్ముఖ్ తో క్లోజ్ ఉండకుండా.. డిస్టెన్స్ మెయింటింగ్ చేయడంపై ఆమె మాట్లాడుతూ.. అలా ఏమి లేదు.. షణ్ముఖ్ పర్సనల్ లైఫ్ లో జరుగుతుంది అనుకోలేదు. 

అలా తనకి బ్రేకప్ అయ్యాక.. నేను తనతో మట్లాడడం, తాను నాతో మాట్లాడం అనేది మాకు కరెక్ట్ కాదనిపించింది. సో అలా అనుకున్నాకే మేము మా కెరీర్ లో బిజీగా మారాము. ఎవ్వరు, ఎక్కడ, ఎలా ఉన్నా బావుండాలి అని కోరుకున్నాము. మేము మళ్ళీ కలవడానికి కొద్దిగా సమయం పడుతుంది అంటూ సిరి షణ్ముఖ్ తో ఎందుకు దూరంగా ఉంటుందో చెప్పింది. 

Siri on Shanmukh breakup:

Bigg Boss Siri on Shanmukh-Deepthi Sunaia breakup

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ