ఈటివి జబర్దస్త్ లో నా స్కిట్స్ టాప్ అంటే కాదు అదిరింది కామెడీ షో లో నా స్కిట్స్ టాప్ అంటూ గతంలో హైపర్ ఆది సద్దాం లు దెబ్బలాడుకున్నారు. నేను హైపర్ ఆదికన్నా తోపు, అయన కామెడీ కన్నా నా కామెడీనే బావుంటుంది అంటూ గతంలో సద్దాం ఆదిపై చేసిన కామెంట్స్ కి ఆది కూడా ధీటుగా సమాధానం చెప్పాడు. నా స్కిట్స్ కి యూట్యూబ్ లో కోట్లలో వ్యూస్ ఉంటాయి. అక్కడే టాప్ ఎవరో అనేది తెలుస్తుంది అంటూ సద్దాం కామెంట్స్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యాడు ఆది.
ఇక వాళ్ళ మధ్యన అలా డైరెక్ట్ వార్ కాస్తా.. సద్దాం జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాక కోల్డ్ వార్ గా మారింది అంటారు. కానీ సద్దాంకి నాకు ఒకప్పుడు విభేదాలు ఉన్నా ఇప్పుడేం లేవు అంటాడు ఆది. ప్రతి గురువారం సద్దాం, ఆది స్కిట్స్ జబర్దస్త్ లో వస్తున్నాయి. మరి ఏ స్కిట్స్ లో ఎవరు తోపో అనేది.. జెడ్జెస్ చెప్పినా ఆడియన్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో తెలియదు. స్కిట్స్ అయితే ఎక్కువగా గురువారం ఎపిసోడ్ లో హైపర్ ఆది ఎగరేసుకుపోతున్నాడు.
ఇక్కడ జబర్దస్త్ లో ఒకేరోజు స్కిట్స్ చేస్తున్న సద్దాం-ఆది లలో ఎవరు టాప్ అనే ప్రశ్న ఆల్మోస్ట్ అందరిలో తలెత్తుతుంది. మరి నువ్వా-నేనా అనే ఆది-సద్దాం లలో ఎవరు నెంబర్ 1 అనేది ప్రేక్షకులే తేల్చాలి.