తమ్మారెడ్డి భరద్వాజ రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ కి పెడుతున్న ఖర్చుపై చేసిన కామెంట్స్ పలువురికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాస్న్ ఆయన్ని తిట్టిపోస్తున్నా.. ఈ విషయమై నిన్నటివరకు సినీ సెలబ్రిటీస్ నుండి ఎలాంటి స్పందన లేదు. ఆర్.ఆర్.ఆర్ కి 80 కోట్లుఖర్చు పెట్టి ఆస్కార్ నామినేషన్స్ వరకు తీసుకెళ్లారు.. ఆ డబ్బుతో పది సినిమాలు తీసి మోహన కొడతా అంటూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నిన్న గురువారం సాయంత్రం తమ్మారెడ్డి వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు, నాగబాబు ఫైర్ అయ్యారు. నాగబాబు అయితే నీ అమ్మ మొగుడు ఇచ్చాడా ఆ 80 కోట్లు, దానికి ఇంత బాధపడిపోతున్నావంటూ ఘాటైన వ్యాఖ్యలు చెయ్యగా.. రాఘవేంద్ర రావు సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్ చేసారు.
మిత్రుడు భరద్వాజ్ కి,
తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి.. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..?
జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ? అంటూ తమ్మరెడ్డిని ఏకి పడేసారు.