రామ్ చరణ్-ఎన్టీఆర్ మరో రెండు రోజుల్లో అమెరికాలో జరగబోయే ఆస్కార్ అవార్డుల వేడుకకి తయారవడమే కాదు.. మధ్యలో హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ అభిమానులని మరింతగా సర్ప్రైజ్ చేస్తున్నారు. నిన్న రామ్ చరణ్ ఎంటర్టైన్మెంట్ టునైట్ లో మాట్లాడుతూ ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ గురించి అలాగే.. హాలీవుడ్ దర్శకులతో పని చెయ్యబోయే విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఎంటర్టైన్మెంట్ టునైట్ లో మట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ముచ్చటించాడు.
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేయడం చాలా కష్టమైన పని అని, ఉక్రెయిన్ లో ఈ పాట షూటింగ్ కి వారం ముందు చరణ్ నేను చాలా సార్లు ప్రాక్టీస్ చేసేవాళ్లమని, పాట చిత్రీకరణలో సమయంలో కూడా ఎన్నో సార్లు రిహార్సల్స్ చేశామని, నా కాళ్ళు ఇప్పటికీ హర్ట్ అయ్యి వణుకుతూ ఉంటాయంటూ మాట్లాడిన ఎన్టీఆర్.. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచే మూమెంట్ ని కూడా షేర్ చేసుకున్నాడు. తాము ఆర్.ఆర్.ఆర్ నుంచి వచ్చిన నటులుగా కాకుండా ఇండియన్స్ గా ఎంతో గర్వంగా ఫీల్ అవుతామని, గుండెల్లో మన దేశాన్ని పెట్టుకొని ఎంతో గర్వంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడుస్తానని ఎన్టీఆర్ హాలీవుడ్ మీడియాలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.