న్యూ ఇయర్ రోజున సీనియర్ నటుడు నరేష్.. తాను పవిత్ర లోకేష్ ని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా.. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లుగా, దీనికి మీ ఆశీస్సులు కావాలంటూ ఓ వీడియోని షేర్ చేసి ఆయన మూడో భార్య రమ్యకి షాకిచ్చారు. అంతకుముందు నుండే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. నరేష్-పవిత్ర లోకేష్ ల బంధంపై సంచలన కామెంట్స్ చేస్తూవారిద్దరిని మీడియాకి ఎక్స్ పోజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ నరేష్ ఆమె ని ఎదుర్కొంటూనే పవిత్రతో పెళ్ళికి సిద్ధమయ్యారు. అయితే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి.. నాకు విడాకులివ్వకుండా వాళ్ళు పెళ్లి ఎలా చేసుకుంటారో చూస్తా అంటూ రమ్య ఛాలెంజ్ చేసింది.
ఇక ఈ రెండు నెలలో చాలా డ్రామా నడిచింది. రమ్య తనపై కుట్ర చేస్తుంది, నన్ను చంపించడానికి ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చింది అంటూ నరేష్ కేసు పెట్టడం, ఈమధ్యన నరేష్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి కార్లు ధ్వంశం చేసారు, దానికి కారణం రమ్యనే అంటూ నరేష్ మరోసారి కంప్లైంట్ చెయ్యడం.. మధ్యలో తమ పర్సనల్ వ్యవహారాలను మీడియాలో ఉంచడం కరెక్ట్ కాదు, మమ్మల్ని అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ పవిత్ర, నరేష్ లు విడి విడిగా సైబర్ క్రైమ్ పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడం చూస్తూనే ఉన్నాము.
కానీ ఇప్పుడు నరేష్ ఉన్నట్టుండి తాను పవిత్ర మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచిన వీడియోని షేర్ చేస్తూ.. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముడ్లు
ఏడు అడుగులు 🙏
మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
- మీ #PavitraNaresh ❤️ అంటూ పోస్ట్ చెయ్యడం చూసిన వారు షాకవుతున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకుని.. ఇలా వీడియోతో ఆ పెళ్లి విషయాన్ని నరేష్-పవిత్రలు తెలియాజేశారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నరేష్-పవిత్ర పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.