సీనియర్ నరేష్-పవిత్ర లోకేష్ లు నాలుగేళ్ళ ప్రేమని పెళ్లి బంధంతో ముడివేసుకున్నారు. కొన్నాళ్లుగా కలిసి ఉంటున్న నరేష్-పవిత్ర లోకేష్ లు ఫైనల్లీ పెళ్లి పీటలెక్కారు. అయితే వారి పెళ్లి ఎప్పుడు జరగబోతుందో అనేది ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గానే గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకుని ఆ పెళ్లి వీడియోతో అందరిని ఆశ్చర్యపరుస్తూనే సర్ప్రైజ్ ఇచ్చారు. నరేష్ నిన్న తన సోషల్ మీడియా అకౌంట్ లో పవిత్రనితో ఏడడుగులు నడిచిన వీడియోని షేర్ చేసాడు. సాంప్రదాయబద్దంగా నరేష్-పవిత్రల పెళ్లి జరిగిపోయింది. నరేష్ కి ఇది నాలుగో పెళ్లి. పవిత్రకి రెండో పెళ్లి.
నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నరేష్-పవిత్రల వివాహం అవ్వకుండా చాలా రాద్ధాంతం చేసింది. కానీ ఆమె నరేష్ నాలుగో పెళ్లిని ఆపలేకపోయింది. ఇక పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైన నరేష్-పవిత్రలు కొద్దిరోజులపాటు దుబాయ్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే అది హనీమూన్ అనుకోవాలో.. లేదంటే రిలాక్సేషన్ కోసం వెళ్లారు అనుకోవాలో.. ఏమనుకోవాలి.. నరేష్-పవిత్రల దుబాయ్ ట్రిప్ ని అంటూ నెటిజెన్స్ రకరకాలుగా ఈ ప్రయాణంపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నరేష్-పవిత్రలు దుబాయ్ ఎడారుల్లో విహరిస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీరిద్దరూ ఇసుక తిన్నెల్లో జంటగా చెయ్యి చెయ్యి పట్టుకుని ఫొటోలకి ఫోజులిచ్చారు. అయితే పెళ్ళయ్యి కొద్దిరోజులు గడిచాకే వీరు తమ పెళ్లి విషయాన్ని వెల్లడించారని.. నరేష్ ఆ వీడియో వదిలిన వెంటనే దుబాయ్ కి వెళ్లారో.. లేదంటే దుబాయ్ వెళ్ళాక షేర్ చేసారో అంటున్నారు.