Advertisementt

ఇది కదా ఎన్టీఆర్ ఫాన్స్ కి కావాల్సింది

Sat 11th Mar 2023 10:04 AM
ntr,oscars  ఇది కదా ఎన్టీఆర్ ఫాన్స్ కి కావాల్సింది
Fans Want These From New NTR ఇది కదా ఎన్టీఆర్ ఫాన్స్ కి కావాల్సింది
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ ఫాన్స్ కి NTR30 అప్ డేట్ కన్నా ముందు ఎన్టీఆర్ లుక్ విషయంలో ఎన్టీఆర్ ఫాన్స్ చాలా టెన్షన్ పడేవారు. ఆర్ ఆర్ ఆర్ కోసం వెయిట్ పెరిగిన ఎన్టీఆర్ దానిని తగ్గించుకోవడానికి చాలా రోజుల సమయం తీసుకున్నాడు. అందులో ఎన్టీఆర్ హైట్ తక్కువ కావడంతో అతని బరువు కొట్టొచ్చినట్టుగా కనిపించేది. అందుకే ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ హడావిడి తర్వాత పెద్దగా పబ్లిక్ లోకి వచ్చింది లేదు. ఇక కొద్దిరోజులుగా ఎన్టీఆర్ మంచి మేకోవర్ లో కనిపిస్తున్నాడు. జనవరిలో అమెరికా వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆస్కార్స్ కి అమెరికా వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ లుక్ చూసి ఎన్టీఆర్ ఫాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు.

మరో పది రోజుల్లో NTR30 మొదలు కాబోతున్న తరుణంలో ఎన్టీఆర్ ఆస్కార్స్ వేడుకలో పాల్గొనడానికి ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నాడు. అక్కడ నుండి ఎన్టీఆర్ ఫోటో షూట్ సోషల్ మీడియాకి చేరగానే ఎన్టీఆర్ ఫాన్స్ అలెర్ట్ అవుతున్నారు. లైక్స్, షేర్స్ తో మోగించేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటూ హడావిడి చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఇన్స్టా లో రెండు ఫొటోస్ ని షేర్ చేసాడు. ఆ పిక్స్ లో ఎన్టీఆర్ మేకోవర్ కి ఎన్టీఆర్ ఫాన్స్ కి కడుపు నిండిపోయింది. ఎన్టీఆర్ ట్రాన్సఫార్మేషన్ కి ఫిదా అవుతున్నారు.

నిజంగా ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ చూస్తే సూపర్బ్ అనాల్సిందే. అంతలాంటి లుక్ లో మెస్మరైజ్ చేసాడు. ఇక ఎన్టీఆర్ ఆస్కార్స్ వేడుకలకి హాజరై.. తిరిగి హైదరాబాద్ రాగానే.. NTR30 మొదలు పెట్టేందుకు కొరటాల ఏర్పాట్లు చేస్తున్నారు. 

Fans Want These From New NTR:

Oscars: NTR making powerful waves in the US

Tags:   NTR, OSCARS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ