Advertisementt

నానిని ఫాలో అవ్వని విశ్వక్

Sat 11th Mar 2023 05:19 PM
das ka dhamki,nani  నానిని ఫాలో అవ్వని విశ్వక్
Vishwak who doesn't follow Nani నానిని ఫాలో అవ్వని విశ్వక్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా ఫిలిమ్స్ అంటూ పాన్ ఇండియా రిలీజ్ అంటూ ప్రకటించడమే కాదు.. అందుకు తగ్గ ప్రమోషన్స్ కూడా ఉండాల్సిందే. రాజమౌళి బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లా ఎవరూ చేయలేకపోయినా.. అల్లు అర్జున్ పుష్ప ని కొంతలో కొంత గట్టిగానే ప్రమోట్ చేసాడు. కానీ తర్వాత మళ్ళీ ఏ పాన్ ఇండియా ఫిల్మ్ ఆ రేంజ్ ప్రమోషన్స్ చెయ్యలేదు. కానీ ఇప్పుడు నాని దసరా ని పాన్ ఇండియాలోని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. అందుకు తగ్గ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. ఇప్పటికే తెలుగు నుండి ముంబై అక్కడి నుండి చెన్నై, ఆ తర్వాత కేరళ, బెంగుళూరు ఇలా ఐదు భాషల ప్రేక్షకుల్లోకి దసరాని పరిచయం చేస్తున్నాడు.

కానీ మరో హీరో విశ్వక్ సేన్ మాత్రం నానిని ఫాలో అవ్వలేకపోతున్నాడు. విశ్వక్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, హీరోగా చేసిన ధమ్కీ పాన్ ఇండియా రిలీజ్ అన్నాడు. అలాగని పాన్ ఇండియాలో ప్రమోషన్స్ చెయ్యడం లేదు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ధమ్కీ ఈ నెల 22 న రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా రిలీజ్ అన్నప్పటికీ.. ఆ హడావిడీ మాత్రం లేదు. విశ్వక్ ధమ్కీ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమా అనేలా ఉంది.

నానిలా విశ్వక్ సేన్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్ళడానికి అదే విధంగా ప్రమోషన్స్ చేపడతాడని చాలామంది ఎక్స్పెక్ట్ చేసారు. కానీ విశ్వక్ మాత్రం నానిని ఫాలో అవ్వడం లేదు.

Vishwak who doesn't follow Nani:

Das Ka Dhamki Pan India Release On March 22nd

Tags:   DAS KA DHAMKI, NANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ