ధనుష్-వెంకీ అట్లూరి కలయికలో క్లాస్ మూవీగా తెరకెక్కిన సార్ మూవీ థియేటర్స్ లో కలెక్షన్స్ పరంగా బాగానే వసూలు చేసింది. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమాతో సితార నిర్మాణ సంస్థ బాగానే పోగుచేసుకుంది. అయితే థియేటర్స్ లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సార్ మూవీని ఓటిటిలో రిలీజ్ చేసునేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నుండి సార్ ఓటిటి ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
తాజాగా సార్ ఓటిటి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. సార్ వస్తున్నాడు అందరూ క్లాసెస్ కి అటెండ్ కావాల్సిందే అంటూ మార్చి 17 న సార్ ఓటిటి రిలీజ్ డేట్ నెట్ ఫ్లిక్స్ వారు ప్రకటించారు. తెలుగులో సార్ గా, తమిళంలో వాతి గా ఒకేరోజు థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రాన్ని ఒకే రోజు తెలుగు, తమిళ భాషల్లో నెట్ ఫ్లిక్స్ నుండి మార్చ్ 17 నే ఓటిటి ఆడియన్స్ కి అందుబాటులోకి రానున్నట్లుగా పోస్టర్స్ వేసి ప్రకటించారు.
మరి థియేటర్స్ లో మిస్ అయిన ధనుష్ చెప్పే పాఠాలని సార్ ఓటిటిలో చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్, ఓటిటి ఆడియన్స్ రెడీ అవుతున్నారు.