నిన్న సోమవారం సినీ ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డు ఆస్కార్ అవార్డు గెలుచుకుని ఆర్ ఆర్ ఆర్ నాటు సాంగ్ సోషల్ మీడియాలోనూ, ఛానల్స్ లోనూ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. గతంలోనూ బాలీవుడ్ కి ఆస్కార్ వచ్చినప్పుడు ఈ రేంజ్ సంతోషంగా అందరికీ ఉన్నా అప్పట్లో సోషల్ మీడియా ఇంతగా ప్రాచుర్యం పొందలేదు గనక ఎవరి ఆనందాన్ని వారు వ్యక్తం చేసినా.. అది ఇంతగా స్ప్రెడ్ అవ్వలేదు. కానీ నిన్న ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డుని ప్రకటించగానే ఆ సంతోషం మొత్తం సోషల్ మీడియా ద్వారా చూపించారు.
టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది అంటూ ట్వీట్స్ వేసి ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. కానీ బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ రావడం నచ్చిందో, నచ్ఛలేదో కానీ.. పెద్దగా ఎవరూ స్పందించలేదు. అలియా భట్ ఇన్స్టా స్టోరీస్ లో ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ రావడంపై స్పందించింది. అలాగే ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ రావడంపై ఆ టీమ్ కి కంగ్రాట్స్ చెప్పింది. మిగతా ప్రముఖులు ఎవరూ పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోలేదనిపించేలా కనిపించింది. అక్కడక్కడా కరణ్, అజయ్ దేవగన్ లాంటి వారు ట్వీట్స్ వేశారు అంతే.
టాప్ హీరోలు కానీ, బాలీవుడ్ మేకర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ అంతగా ఆర్.ఆర్.ఆర్ టీమ్ ని అప్రిషేట్ చేసింది లేదు. సోషల్ మీడియాలోనూ బాలీవుడ్ ట్వీట్స్ కనిపించకపోయేసరికి.. వాళ్ళు ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ రావడం పట్ల నిరాశపడినట్లుగా ఉన్నారు. సౌత్ సినిమా మొదటిసారి ఆస్కార్ అవార్డు సాధించడం పట్ల వారు అస్సలు సంతోషంగా లేరేమో అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.