పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉంటారు. ఆయనకున్న అభిమానగణం మరో హీరోకి ఉండరన్నట్టుగా పవన్ ఫాన్స్ ఆయన్ని కొలిచేస్తారు. పవన్ అంటే వీరాభిమానం ఉన్న ఫాన్స్ ఒక్కోసారి రచ్చ కూడా చేస్తారు. ఇతర హీరోల అభిమానులతో గొడవలు పడతారు. ఫ్లెక్సీలు కడతారు. అంత అభిమానం ఉన్నా పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లో సపోర్ట్ చెయ్యరు. ఆయన సినిమాలు చేస్తే విపరీతంగా ఆదరించే అభిమానులు.. రాజకీయాల్లో రిజెక్ట్ చెయ్యడం ఇప్పటికీ ఎవరికి అర్ధం కాదు.. ఆయన ఎక్కడ సభ పెట్టినా లక్షల్లో ఆ సభకు హాజరై దానిని సక్సెస్ చేస్తారు.
కానీ రాజకీయంగా ఆయనకి బలాన్ని ఇవ్వరు. తాజాగా విజయవాడ ఆటో నగర్ నుండి మచిలీపట్టణం జనసేన ఫర్మేషన్ డే సభ కోసం కదిలిన పవన్ వెంట వేలాదిమంది వాహనాలతో ఫాలో అయ్యారు. ఆయనకి అడుగడుగునా నీరాజనాలు అందించారు. ఆయన ఎక్కడ ఆగి అక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ గుంపులు గుంపులుగా జనాలు. మచిలీపట్టణం సభలో అయితే కిక్కిరిసిపోయారు. ఇసుక వేస్తె కిందకి రాలేదేమో అన్నంతగా జనాలు ఆ సభకు కదిలి వచ్చారు.
అంతగా ఆయన్ని ఆదరిస్తూ, అభిమానం చూపిస్తూ ఉన్న అభిమానులు రాజకీయాల్లో కూడా పవన్ ని సపోర్ట్ చేస్తే ఆయన సీఎం అవడం ఖాయం అన్నంతగా నిన్న సభ చూస్తే అనిపించింది. జై పవన్, సీఎం పవన్ అంటూ అక్కడి అభిమానుల కేకలు, అరుపులు, స్లొగన్స్ తో సభ మొత్తం దద్దరిల్లింది. మరి ఇంత అభిమానం ఉంచుకున్న ఆయన అభిమానులు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ని మోసం చెయ్యడం తగునా అనే ప్రశ్న నెటిజెన్స్ వెయ్యడమూ కరెక్ట్ కదా.!