పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చెయ్యడమే కాదు.. నిజంగానే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ సరసన నిలిచి నెంబర్ 1 స్థానంలో ఉండి హాలీవుడ్ కే షాకిచ్చి వచ్చాడు. రీసెంట్ గా ఆస్కార్ అవార్డుల కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ కి అక్కడి అభిమానులు బ్రహ్మరధం పట్టారు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన రోజున 24 గంటల్లో ఇంటర్నెట్ లో అత్యధికంగా ట్రెండ్ అయిన హీరోల్లో ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు.
అలాగే ఆస్కార్ వేడుకకి హాజరైన స్టార్స్ లో బెస్ట్ డ్రెస్ కేటగిరిలో ఎన్టీఆర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండడమే అతని క్రేజ్ కి అద్దం పడుతుంది. అమెరికా నుండి హైదరాబాద్ రాగానే.. ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ భార్య ప్రణతి ఆయనకి బ్రహ్మరథం పట్టారు. అమెరికా నుండి అవిచ్చిన ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మట్లాడారు. కీరవాణి-చంద్రబోస్ లు ఆర్.ఆర్.ఆర్ సినిమాకి నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అందుకోవడం ఎన్నటికి మరిచిపోలేని, ఇదంతా దక్కడానికి మీ అభిమానమే కారణమన్నారు.
ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ తన సినిమా ఓపెనింగ్ లో హడావిడి చేస్తాడనుకుంటే.. ఎన్టీఆర్ క్రేజ్ ని ముందుగా విశ్వక్ సేన్ వాడేసుకుంటున్నాడు. విశ్వక్ పాన్ ఇండియా ఫిల్మ్ ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని ఆహ్వానించి ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చాడు. మరి ధమ్కీ ఈవెంట్ కి వచ్చి విశ్వక్ కి ఎంత హెల్ప్ అవుతాడో తెలియదు కానీ.. ఇప్పుడు అందరి కళ్ళు ఎన్టీఆర్ స్టయిల్ అలాగే ఆయన స్పీచ్ పైనే ఉండబోతుంది.
ఎందుకంటే ఎన్టీఆర్ ఆస్కార్ తర్వాత ఓ పబ్లిక్ ఈవెంట్ కి రావడం ధమ్కీ తోనే స్టార్ట్ అవుతుంది. మరి ఈ హైప్ ని ఎన్టీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తాడో.. ధమ్కీ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడో అనే విషయంపైనే అందరి చూపు ఉంది. సో ఎన్టీఆర్ క్రేజ్ ధమ్కీ కి విశ్వక్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.