అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ కి గ్లోబల్ గోల్డ్ అవార్డు తో పాటుగా.. HCA అవార్డు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని అందుకుని ఆర్.ఆర్.ఆర్ టీమ్ అంతా సెలెబ్రేట్ చేసుకోవడమే కాదు.. తెలుగు ప్రజల హృదయాలు ఉప్పొంగేలా చేయడంతో పాటు భారతీయులందరికి గర్వకారణంగా నిలిచారు. ఎన్టీఆర్-రామ్ చరణ్, రాజమౌళి ఫ్యామిలీ, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్.. ఇలా ఆ పాటకు సంబంధం ఉన్న వారంతా అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకల్లో సందడి చేసారు.
అక్కడ ఆస్కార్ హడావిడి ముగియగానే రాజమౌళి టీమ్ అందరికి స్పెషల్ పార్టీ ఇవ్వగా అందులో రామ్ చరణ్ ఆయన వైఫ్ ఉపాసన, మిగతావాళ్లంతా ఎంజాయ్ చేసారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితమే అమెరికా నుండి హైదరాబాద్ కి చేరుకోగానే.. అభిమానులు ఆయనకి అద్భుత స్వాగతం పలికారు. నేడు శుక్రవారం తెల్లవారు ఝామున 3 గంటలకి రాజమౌళి ఆయన భార్య రమా, కార్తికేయ ఆయన భార్య పూజ, కీరవాణి ఆయన భార్య వల్లి ఇలా అంతా హైదరాబాద్ కి చేరుకున్నారు.
ఆస్కార్ అవార్డుతో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ఆర్.ఆర్.ఆర్ టీమ్ ని చూడగానే మీడియా గుమ్మి కూడింది. కానీ రాజమౌళి అండ్ ఫ్యామిలీ మీడియాతో మాట్లాడకుండానే జై హింద్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.