Advertisementt

డ్రీమ్ హౌస్ లోకి నాగ చైతన్య

Fri 17th Mar 2023 08:18 PM
naga chaitanya,jubilee hills  డ్రీమ్ హౌస్ లోకి నాగ చైతన్య
Naga Chaitanya buys new home in Hyderabad డ్రీమ్ హౌస్ లోకి నాగ చైతన్య
Advertisement
Ads by CJ

నాగ చైతన్య సమంతని పెళ్లి చేసుకున్నాక మురళి మోహన్ వాళ్ళ ఇల్లు కొనుక్కుని దానిలో ఆ జంట కాపురం పెట్టారు. తర్వాత సమంత తో కలిసి నాలుగేళ్ళు ఆ ఇంట్లోనే ఉన్న నాగ చైతన్య మరో ఇల్లు కట్టించుకోవడానికి రెడీ అయ్యాడు. కానీ నాగ చైతన్య ఆ ఇంటి నిర్మాణంలోనే ఉండగా సమంత కి విడాకులిచ్చి కొన్నాళ్ళు హోటల్ లో ఉన్నాడు. తర్వాత సమంత కూడా ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయి.. మళ్ళీ తిరిగి ఆ ఇంటిని కొన్న ఓనర్స్ తో మాట్లాడుకుని సమంత ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నప్పటికీ.. నాగ చైతన్య మాత్రం తన డ్రీమ్ హౌస్ ని కట్టించుకుంటూ ఉన్నాడు. 

తన టేస్ట్ కి తగ్గట్లుగా కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. తండ్రి నాగార్జున ఇంటికి దగ్గరలోనే జూబ్లీ హిల్స్ లో నాగ చైతన్య తన డ్రీమ్ హౌస్ ని నిర్మించుకున్నాడు. అయితే తాజాగా నాగ చైతన్య తన డ్రీమ్ హౌస్ లోకి ఎలాంటి హడావిడి లేకుండా అడుగుపెట్టేసాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోట్ల రూపాయలు ఖర్చుతో నాగ చైతన్య ఈ ఇంటిని మిగిలిన స్టార్ల ఇళ్లకు ఏమాత్రం తగ్గని స్థాయిలోగ్రాండ్ గా కట్టించుకున్నాడట. గార్డెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్, థియేటర్.. ఇలా సకల సౌకర్యాలు ఉండేలా విలాసవంతమైన ఇంటిని చైతు కట్టుకున్నాడని తెలుస్తుంది. కొత్తగా గృహ ప్రవేశం చేసిన నాగ చైతన్య ఇకపై ఆ ఇంట్లోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. 

ప్రస్తుతం నాగ చైతన్య నటించిన కష్టడి విడుదలకు సిద్దమవుతుంది. దానికి సంబందించిన టీజర్ రిలీజ్ కాగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Naga Chaitanya buys new home in Hyderabad:

 Naga Chaitanya has invested in a new property in Jubilee Hills 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ