Advertisementt

చరణ్ అక్కడ-ఎన్టీఆర్ ఇక్కడ

Fri 17th Mar 2023 10:16 PM
ram charan,ntr,dhamki event  చరణ్ అక్కడ-ఎన్టీఆర్ ఇక్కడ
Charan there - NTR here చరణ్ అక్కడ-ఎన్టీఆర్ ఇక్కడ
Advertisement
Ads by CJ

ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ హీరోలిద్దరూ పబ్లిక్ లోనే కనిపించారు. ఆర్.ఆర్.ఆర్ పాటకి ఆస్కార్ వచ్చాక ఎన్టీఆర్-రామ్ చరణ్ లు హాగ్ ఇచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న తర్వాత ఎన్టీఆర్ అమెరికా నుండి హైదరాబాద్ కి వచ్చెయ్యగా రామ్ చరణ్ ఈరోజే తన భార్య ఉపాసనతో కలిసి ఢిల్లీలో దిగాడు. రామ్ చరణ్ కి మోడీ అప్పాయింట్మెంట్ దొరకడంతో చరణ్ అమెరికా నుండి నేరుగా ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ ఢిల్లీలో దిగగానే మీడియాతో మట్లాడుతూ నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించడం సంతోషంగా ఉంది. ఈపాట మన అందరిది, మీ అందరికి ధన్యవాదాలంటూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో హడావిడి చేసాడు.

ఎన్టీఆర్ మాత్రం ఈరోజు హైదరాబాద్ లో హడావిడి చేసాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హీరో విశ్వక్ సేన్ ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడా.. అని ఈరోజు ఉదయం నుండే ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటుగా యావత్ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూసారు. ధమ్కీ ఈవెంట్ లో ఆర్.ఆర్.ఆర్ నుండి నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించడం ఆనందంగా ఉంది. అది మీ అందరి అభిమానంతోనే.. మీ తరుపున మేము ఆస్కార్ అందుకోవడానికి అమెరికా వెళ్ళాము, మా తరుపున కీరవాణి గారు, చంద్ర బోస్ గారు ఆస్కార్ అందుకున్నారు. 

ఆస్కార్ స్టేజ్ పై కీరవాణి గారు, చంద్రబోస్ గారు కనిపించలేదు. ఇద్దరు భారతీయులు కనిపించారు. ఆస్కార్ స్టేజ్ పై తెలుగుదనం ఉట్టిపడింది.. అంటూ ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చాడు. రాజమౌళి గారు, కీరవాణి, చంద్ర బోస్, ప్రేమ్ రక్షిత్, సింగెర్స్ వల్లే ఆస్కార్ సాధ్యమైంది.. ముందుగా మీరిచ్చే అభిమానం, ప్రేమ వల్లే అంటూ ఎన్టీఆర్ స్పీచ్ అదరగొట్టేసాడు.

ఒకేరోజు ఆర్.ఆర్.ఆర్ హీరోలు ఆస్కార్ గురించి రెండు వేర్వేరు ప్రదేశాలలో మాట్లాడడం వాళ్ళ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఎన్టీఆర్ హైదరాబాద్ లో, రామ్ చరణ్ ఢిల్లీలో అలా ఆర్.ఆర్.ఆర్ పై మట్లాడుతూ సందడి చేసారు.

Charan there - NTR here:

Ram Charan in Delhi-NTR at Dhamki event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ