అక్కినేని యంగ్ హీరో సుశాంత్ మెగాస్టార్ చిరంజీవికి బావమరిదిగా కనిపించబోతున్నాడు. భోళా శంకర్ లో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. కీర్తి సురేష్ ని ఇష్టపడే పాత్రలో సుశాంత్ భోళా శంకర్ లో కనిపించబోతున్నాడు. సుశాంత్ కి సిస్టర్ గా తమన్నా కనిపించనుంది.
అదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సుశాంత్ ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన, లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. సుశాంత్ లీడ్ రోల్స్ తో పాటు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలని ఎంపిక చేసుకుంటున్నారు. భోళా శంకర్‌లో అతని పాత్ర చాలా కీలకంగా వుంటుంది. అంటే మెగాస్టార్ కి బావమరిగా అన్నమాట. సుశాంత్ బర్త్ డే సందర్భంగా వదిలిన పోస్టర్ లో సూట్‌లో లైట్ గడ్డంతో ఛార్మింగా కనిపిస్తున్నాడు.