Advertisementt

రష్మికకి చెక్ పెడుతున్న ఆ ఇద్దరు

Sun 19th Mar 2023 11:39 AM
krithi shetty,sreeleela,rashmika mandanna  రష్మికకి చెక్ పెడుతున్న ఆ ఇద్దరు
Those two are giving check to Rashmika రష్మికకి చెక్ పెడుతున్న ఆ ఇద్దరు
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న గత ఏడాది వరకు మార్మోగిపోయిన పేరు. కానీ ఈ ఏడాది టాలీవుడ్ లో రష్మిక పేరు పుష్ప ద రూల్ కి తప్ప పెద్దగా వినిపించడమే లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో రశ్మికకి ఆఫర్ తగిలితే మళ్ళీ అమ్మడు పేరు మోగిపోయేది. కానీ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ని తీసుకొస్తున్నాడు. రామ్ చరణ్ RC16 కోసం రష్మిక పేరు వినిపించినా.. బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం బాలీవుడ్ భామ ని తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తుంది. అటు బాలీవుడ్ లో సక్సెస్ లేదు.

అయితే ఇప్పుడు రశ్మికకి తెలుగులో ఇద్దరు భామలు చెక్ పెట్టెయ్యబోతున్నట్లుగానే కనబడుతుంది వ్యవహారం. వారే శ్రీలీల -కృతి శెట్టి. ప్రస్తుతం యంగ్ హీరోల సరసన నటిస్తూ శ్రీలీల ఎనిమిది ప్రాజెక్ట్ లతో కళలాడుతుంటే.. ఇప్పుడు స్టార్ హీరోల కన్ను కూడా శ్రీలీల మీద పడేలా ఉంది. అటు కృతి శెట్టికి సక్సెస్ లు లేకపోయినప్పటికీ.. ఆమె కూడా వరస ప్రాజెక్టులతో బిజీగా వుంది. ఇకపై యంగ్ హీరోలకి శ్రీలీల-కృతి శెట్టిలే బెస్ట్ అప్షన్ లా కనిపిస్తున్నారు. వీరిద్దరిని దాటి బయటికి వెళ్లేలా హీరోలు కనిపించడం లేదు.

ఒక్కసారి శ్రీలీల హిట్ కొడితే స్టార్ హీరోల చూపు కూడా ఆమెపై పడుతుంది. వారు కూడా ఆఫర్స్ ఇస్తారు. ఇక కృతి శెట్టి కూడా అంతే.. అప్పుడు రశ్మికని పెద్దగా వారు పట్టించుకోరేమో.. ఇప్పటికే ఈ కన్నడ భామకి.. తెలుగు, తమిళ ఆఫర్స్ కూడా లేవు... ఒక్క హిందీలో తప్ప. అలాగే పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప మాత్రమే రష్మిక చేతిలో ఉంది.

Those two are giving check to Rashmika:

Krithi Shetty and Sreeleela Giving Highly Competiton To Rashmika Mandanna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ