Advertisementt

హైదరాబాద్‌కి కియారా అద్వానీ

Mon 20th Mar 2023 09:09 AM
kiara advani,ram charan,rc15,hyderabad,kiara marriage,tollywood  హైదరాబాద్‌కి కియారా అద్వానీ
Kiara Advani Lands In Hyderabad For RC15 Shoot హైదరాబాద్‌కి కియారా అద్వానీ
Advertisement
Ads by CJ

కొత్త పెళ్లి కూతురు కియారా అద్వానీ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. గత నెల ఫిబ్రవరిలో ప్రేమికుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు నడిచిన కియారా అద్వానీ.. పెళ్లి, రిసెప్షన్ పనులు ముగించుకుని షూటింగ్స్‌లో బిజీ అయ్యింది. అయితే కియారా అద్వానీ ప్రస్తుతం సౌత్‌లో రామ్ చరణ్‌తో RC15లో నటిస్తుంది. కియారా పెళ్లి, రామ్ చరణ్ ఆస్కార్ అవార్డుల కోసం అమెరికా వెళ్లడం, అటు దర్శకుడు శంకర్ కూడా భారతీయుడు2 షూటింగ్ కి షిఫ్ట్ అవడంతో RC15 షూటింగ్‌కి భారీ గ్యాప్ వచ్చేసింది.

ఇక రామ్ చరణ్ కూడా ఆస్కార్ విజయాన్ని ముగించుకుని అమెరికా నుండి హైదరాబాద్‌కి వచ్చాడు. RC15 కొత్త షెడ్యూల్ కోసం శంకర్-రామ్ చరణ్ లు ప్రిపేర్ అవుతుండగా..ఈ కొత్త షెడ్యూల్‌లో పాల్గొనేందుకు కియారా అద్వానీ కూడా హైదరాబాద్‌కి వచ్చేసింది. ఈ నెలలోనే అంటే మరో వారంలో రాబోయే రామ్ చరణ్ పుట్టిన రోజు స్పెషల్‌గా RC15 టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్ వదలబోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజ్‌లకి కలిపి CEO టైటిల్ RC15కి పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. 

ఈ నెలలో ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేసి.. సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారు. సంక్రాంతి టార్గెట్‌గానే దర్శకుడు శంకర్ RC15ని పూర్తి చేస్తున్నట్టుగా ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Kiara Advani Lands In Hyderabad For RC15 Shoot:

Kiara Advani Lands In Hyderabad After Marriage For RC

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ