Advertisementt

ఇంత జరుగుతున్నా స్పందించరే.??

Mon 20th Mar 2023 11:03 AM
nagababu,niharika  ఇంత జరుగుతున్నా స్పందించరే.??
Nagababu did not respond on Niharika divorce ఇంత జరుగుతున్నా స్పందించరే.??
Advertisement
Ads by CJ

ఏ విషయమైనా యూట్యూబ్ ఛానల్స్ లోనో, లేదంటే సోషల్ మీడియా ద్వారానో మాట్లాడే నాగబాబు.. ఇప్పుడు కూతురు నిహారిక విషయంలో జరుగుతున్న ప్రచారంపై నోరు మెదపడం లేదు. తన ఫ్యామిలీని కానీ, తన అన్న చిరూని కానీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ ని కానీ, రామ్ చరణ్ ని కానీ ఎవ్వరైనా ఏమైనా అంటే.. విరుచుకుపడిపోయే నాగబాబు గారు ఇప్పుడు సైలెంట్ గా కనబడుతున్నారు. జనసేన పార్టీ కార్యలాపాలతో అటు రాజకీయాల్లో బిజీగా వున్నారు.

అయితే నిన్న ఆదివారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలిలో మరో విడాకులు అనే న్యూస్ హైలెట్ అయ్యింది. గతంలో చిరు చిన్న కుమార్తె శ్రీజ కళ్యాణ్ దేవ్ కి విడాకులిచ్చి ఒంటరిగా ఉంటుంది. ఆ విషయంలో మీడియాకి ఇంకా కన్ఫ్యూషనే. ఇప్పడు నాగబాబు కుమర్తె నిహారిక ఆమె భర్త తో విడాకులు తీసుకోబోతుంది అనే అనుమానాలు కలిగేలా.. నిహారిక భర్త చైతన్య ఇన్స్టా నుండి పెళ్లి ఫొటోస్, అలాగే నిహారికతో కలిసున్న పిక్స్ ని డిలేట్ చెయ్యడంతో పాటుగా ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడంతో అందరిలో ఈ అనుమానం పుట్టింది.

సోషల్ మీడియాలో నిహారిక విడాకుల మేటర్ తెగ హడావిడి చేసింది. ప్రముఖ వెబ్ సైట్స్, సోషల్ మీడియా మొత్తం నిహారిక-చైతన్య విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రముఖంగా ప్రచురించాయి. మరి రాజస్థాన్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా కూతురికి వివాహం చేసి.. ఎంతో ఆనందపడిన నాగబాబు ఇంతగా స్ప్రెడ్ అయిన విడాకుల వార్తలని ఎందుకు కొట్టెయ్యడం లేదు. అంటే నిజంగానే నిహారిక ఆమె భర్తతో విడిపోతుందా.. ఇది నిజమా అంటూ మెగా ఫాన్స్ తెగ బాధపడిపోతున్నారు.

Nagababu did not respond on Niharika divorce:

All Is Not Well Between Niharika And Chaitanya ?

Tags:   NAGABABU, NIHARIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ