Advertisementt

ఈ వారం విడుదల కానున్న చిత్రాల లిస్ట్

Mon 20th Mar 2023 11:57 AM
rangamarthanda,dhamki  ఈ వారం విడుదల కానున్న చిత్రాల లిస్ట్
This week theaters and ott release movies ఈ వారం విడుదల కానున్న చిత్రాల లిస్ట్
Advertisement
Ads by CJ

ప్రతి శుక్రవారం కొత్త సినిమాల రిలీజ్ లతో దర్శకనిర్మాతలు టెన్షన్ పడుతుంటే.. బాక్సాఫీసు వద్ద టికెట్స్ గోలతో ప్రేక్షకుల హడావిడి ఉంటుంది. కేవలం థియేటర్స్ లోనే కాదు.. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓటిటి సామ్రాజ్యం నడుస్తుంది. అందుకే ప్రతి శుక్రవారం థియేటర్స్ లో కొత్త బొమ్మ పడితే.. ఓటిటీలలో థియేటర్స్ లోని బొమ్మలు.. అలాగే కొన్ని కొత్త చిత్రాలు నేరుగా రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలను ఓటిటీలలో చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ సిద్దమైపోతున్నారు. ప్రతి వారం లాగే శుక్రవారం కాకుండా.. ముందుగా ఉగాది స్పెషల్ గా బుధవారమే ధమ్కీ, రంగమార్తాండ, గీత సాక్షిగా లాంటి చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు సిద్దమయ్యాయి. అలాగే కొన్ని తెలుగు సినిమాలు అదే రోజు ఓటిటీలలో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి.

థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాల లిస్ట్ ఓసారి చూసేద్దాం..

థియేటర్స్ లో విశ్వక్ సేన్ ధమ్కీ, కృష్ణవంశీ రంగమార్తాండ, గీత సాక్షిగా సినిమాలు బుధవారం మార్చి 22 న థియేటర్స్ లో విడుదలవుతున్నాయి. వీటితో పాటుగా మార్చ్ 24 శుక్రవారం కథ వెనుక కథ రిలీజ్ కాబోతుంది.

ఇక ఓటిటీల విషయానికి వస్తే..

అమెజాన్ ప్రైమ్ నుండి పఠాన్ తెలుగు వెర్షన్ ఈ ఉగాదికి విడుదలకు సిద్ధమైంది. ఆహా నుండి కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ మార్చ్ 22 నే స్ట్రీమింగ్ కాబోతుంది. అదే ఆహా ఓటిటి నుండి మార్చి 22 న పంచతంత్రం స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. వీటితో పాటుగా పలు భాషల నుండి  కొన్ని చిత్రాలు, ఇంకా వెబ్ సీరీస్ లు ప్రముఖ ఓటిటి సంస్థల నుండి అందుబాటులోకి రానున్నాయి.

This week theaters and ott release movies:

Find New Theatres and OTT Releases this Week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ