అల్లు అర్జున్ బర్త్ డే రాబోతుంది. ఏప్రిల్ 8 న బన్నీ పుట్టిన రోజు. గత ఏడాది బన్నీ సినిమాలేవీ విడుదల కాలేదు. దానితో అల్లు అర్జున్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యి ఉన్నప్పటికీ.. పుష్ప పాన్ ఇండియా విజయాన్ని ఎంజాయ్ చేసారు. పుష్ప పార్ట్ 1 ని రిలీజ్ చేసాక.. పార్ట్ 2 మొదలు పెట్టడానికే ఏడాదికి పైగా సమయం తీసుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతం పుష్ప ద రూల్ షూటింగ్ లో బిజీగా వున్నాడు. సుకుమార్ పుష్ప చిత్రీకరణలో తలమునకలై ఉన్నారు. అయితే పుష్ప మొదలైనప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా మేకర్స్ కామ్ గా ఉన్నారు.
ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు అల్లు అర్జున్ బర్త్ డే కి స్పెషల్ టీజర్ కట్ చేస్తున్నారట. మూడు నిమిషాల నిడివి ఉండబోయే ఈ టీజర్ లో అల్లు అర్జున్ యాక్షన్ సీన్స్ ని హైలెట్ చేసి.. అల్లు ఫాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ టీజర్ చూసి ఫాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా సుకుమార్ ఆ యాక్షన్ సీన్స్ ని కట్ చేస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప సెట్స్ లోకి రీసెంట్ గానే విలన్ పాత్రధారి ఫహద్ ఫాసిల్ ఎంటర్ అయ్యారు.
త్వరలోనే హీరోయిన్ రష్మిక మందన్న కూడా పుష్ప సెట్స్ లోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ మధ్యలో కొద్దిగా గ్యాప్ దొరగ్గానే.. భార్య పిల్లలతో కలిసి రాజస్థాన్ కి షార్ట్ ట్రిప్ వేసి హైదరాబాద్ కి వచ్చాడు.