నయనతార ఆమె భర్త విగ్నేష్ శివన్ లు ప్రస్తుతం తల్లితండ్రులుగా కవల పిల్లల బాధ్యతలతో పాటుగా పిల్లలతో ఆడుకుంటూ ఆ మధుర క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాది జూన్ లో వివాహం చేసుకున్న నయనతార దంపతులు సరోగసి ద్వారా తల్లితండ్రులయ్యారు. తర్వాత నయనతార జవాన్ షూటింగ్ లో బిజీగా ఉంటున్న విగ్నేష్ మాత్రం పిల్లల వ్యవహారాలను చూసుకుంటున్నాడు. అయితే కవల పిల్లలు తమ చేతుల్లోకి వచ్చిన తర్వాత మురిసిపోతూ ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. అప్పుడే బిడ్డల మొహాలని కనిపించకుండా కవర్ చేసారు.
ఇక రీసెంట్ గా ముంబై ఎయిర్ పోర్ట్ లోను నయనతార-విగ్నేష్ శివన్ లు తమ కవలల పిల్లలని ఎత్తుకుని కనిపించినా బిడ్డల మొహాలను దాచేసారు. తాజాగా నయన్-విగ్నేష్ లు మరోసారి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసారు. అందులోను పిల్లల చేతులతో తమ చేతులు ఉన్న పిక్స్ మాత్రమే షేర్ చేసారు. విగ్నేష్ చేతిలో నయన్ చెయ్యి, అలాగే మరో చేతిలో బిడ్డ చెయ్యి, నయన్ మరో చేతిలో బిడ్డ చెయ్యి ఉన్న పిక్స్ అవి. ఇక్కడ కూడా పిల్లల మొహాలను కనిపించకుండా నయన్ దంపతులు జాగ్రత్త పడ్డారు.
దానితో నెటిజెన్స్ నయన్ ఏమిటీ దాగుడు మూతలు. ఎన్నాళ్లిలా కవర్ చేస్తూ పిల్లలని దాచేస్తారు.. మాకు ఓసారి చూపించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నయన్ తమ కవల కొడుకులకి పేర్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ పేర్లు ఇప్పటివరకు ఈ జంట ప్రకటించలేదు.