రేపు ఈ సమయానికి టాలీవుడ్ లో ఉగాది ఉప్పెన మొదలవుతుంది. ఉదయం నుంచే కొత్త సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియా జాతరకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇటు థియేటర్స్ లో విడుదల కాబోయే కొత్త సినిమాలు, అటు ఓటిటిలో స్ట్రీమింగ్ కి రాబోతున్న సినిమాలు మాత్రమే కాదు.. కొత్త సినిమాల ఫస్ట్ లుక్స్, టీజర్స్, ఉగాది పోస్టర్స్ అంటూ హంగామా మాములుగా ఉండదు. అందుకే అనేది ఉగాది ఉప్పెన అని. మరి చిన్నా, పెద్ద సినిమాల లుక్స్ వదలడానికి మేకర్స్ కూడా సిద్ధమైపోయారు.
ముఖ్యంగా యంగ్ హీరోలు ఎక్కువగా తమ సినిమాల నుండి కొత్త సంవత్సరాది అంటూ ఉగాది పోస్టర్స్ వదులుతారు. అలాగే మెగాస్టార్ నుండి భోళా శంకర్ ఉగాది పోస్టర్ రావడం పక్కా. నాగార్జున-ప్రసన్న కుమార్ బెజవాడ మూవీ అప్ డేట్ ఉండబోతుంది. బాలకృష్ణ NBK108 నుండి అనిల్ రావిపూడి లుక్ ఏమైనా వదులుతారేమో అని నందనమూరి అభిమానుల ఆశ. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ నుండి ఎలాంటి కొత్త అప్ డేట్స్ ఉండకపోవచ్చు. NTR30 ఉగాది తర్వాత రోజు ప్రారంభం కాబోతుంది. సో దానికి అప్ డేట్ ఉండదు. ఇక అల్లు అర్జున్ పుష్ప నుండి ఆయన బర్త్ ట్రీట్ ఉండబోతుంది. అందుకే పుష్ప అప్ డేట్ ఉగాదికి ఉండే అవకాశం లేదు. ఇక రామ్ చరణ్ బర్త్ డే కరెక్ట్ గా నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో.. అప్పుడే టైటిల్ అండ్ లుక్ ఇవ్వబోతున్నారు మేకర్స్. సో ఉగాదికి RC15 హడావిడి ఉండదు.
ఇక మహేష్ SSMB28 నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఉండొచ్చేమో అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. నితిన్, నిఖిల్, నాని, విజయ్ దేవరకొండ ఇలా యంగ్ హీరోల సినిమాల నుండి ఉగాది పోస్టర్ రావడం పక్కా. చిన్న సినిమాలు గురించి చెప్పక్కర్లేదు. ఉగాదికి పొలోమంటూ లుక్స్, పోస్టర్స్ వదులుతారు. మరి ఈ ఉగాది ఉప్పెన తట్టుకోవడానికి సినీ లవర్ రెడీ గా ఉండండి.