అల్లు అర్జున్ తన పిల్లలు ఆయన్, అర్హలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. షూటింగ్స్ లో బిజీగా తిరుగుతుండే అల్లు అర్జున్.. ఏ కాస్త సమయం దొరికినా ఫ్యామిలీతో వెకేషన్స్.. పిల్లలతో సరదా ఆటలు అంటూ సందడి చేస్తాడు. ఇక కుమార్తె అర్హ అంటే అల్లు అర్జున్ కి ఎంతిష్టమో ఆయన షేర్ చేసే వీడియోస్ లో చూస్తూ ఉంటాము. తాజాగా అర్హ స్కూల్ ఈవెంట్ కి భార్య స్నేహతో కలిసి హాజరయ్యాడు అల్లు అర్జున్.
ఇక నేడు ఆయన తన ఇన్స్టా పేజీ లో తన కూతురు అర్హ యోగ చేస్తున్న పిక్ షేర్ చేసాడు. అర్హ యోగ లో చాలా ఎక్స్ పీరియన్స్ ఉన్నట్టుగా చేసిన యోగాసనం చూస్తూ అల్లు అర్జున్ షాకవుతున్నట్టుగా, అలాగే మురిసిపోతున్నట్టుగా అక్కడే కూర్చున్నాడు. అర్హ చాలా కష్టమైన యోగాసనం వేసి తండ్రిని ఇంప్రెస్స్ చెయ్యడమే కాదు.. ఇంత కష్టమైన యోగాసనం వేసిన అల్లు అర్హని అందరూ పొగిడేస్తున్నారు.
గుడ్ మార్నింగ్ అంటూ అల్లు అర్జున్ షేర్ చేసిన అర్హ యోగ చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అల్లు ఫాన్స్ దానిని ట్రెండ్ చేస్తున్నారు. అర్హ శాకుంతలం సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే.