కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలతో జత కడుతుంది. కాజల్ నటించిన హీరోయిన్ సెంట్రిక్ మూవీ ఘోస్ట్ రీసెంట్ గా తమిళంలో విడుద;ఐ సో సో గా ఆడగా.. ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2 లో నటిస్తుంది. ఈ చిత్రంలో రకుల్ తో కాజల్ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ NBK108 లో హీరోయిన్ గా ఈ మధ్యనే సెట్స్ లోకి ఎంటర్ అయ్యింది.
ఈ చిత్రంలోనూ కాజల్ మరో హీరోయిన్ శ్రీలీల తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. అయితే NBK108 లో కాజల్ పాత్ర నిడివి 40 నిముషాలు ఉండబోతుందట. లీడ్ రోల్ లో నటించబోయే కాజల్ ఈ 40 నిమిషాల కోసం కాజల్ 4 కోట్లు డిమాండ్ చేసిందట. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ 40 నిమిషాల కోసం ఏకంగా 4 కోట్లు పారితోషికం అందుకుంటుందనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఈ భామ పనే బావుంది. పెళ్ళై బిడ్డ పుట్టాక ఆమె రేంజ్ మరింతగా పెరిగిపోయిందిగా అంటున్నారు.
నిజంగానే పెళ్లికి ముందు గ్లామర్ షో తో కాజల్ అగర్వాల్ దూసుకుపోయినా.. తర్వాత సీనియర్ హీరోలకి కేరాఫ్ గా మారింది. చిరు, నాగార్జున ఇప్పుడు బాలయ్య, అటు తమిళనాట కమల్ హాసన్.. మధ్యలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఇలా కాజల్ పని బావుండక మరేమిటి.