షణ్ముఖ్ జస్వంత్ అంటే బిగ్ బాస్ చూసేవాళ్ళకి తెలియకుండా ఉండదు. యూట్యూబ్ ఫాలో అయ్యేవాళ్ళకి షణ్ముఖ్ అంటే హీరోనే. కానీ బిగ్ బాస్ చూసాక షణ్ముఖ్ అంటే ఉన్న క్రేజ్ మొత్తం పోయింది. షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ లో ఆడియన్స్ చూస్తున్నారు అనే విషయాన్ని మరిచిపోయి చూపించిన యాటిట్యూడ్, అలాగే సిరి తో ఫ్రెండ్ షిప్ ముసుగులో హగ్గులు, ముద్దులు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు.. షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ సిరి ఫ్రెండ్ షిప్ వలనే అతనికి బ్రేకప్ చెప్పింది.
దీప్తి సునయనతో ఐదేళ్ల ప్రేమని కేవలం బిగ్ బాస్, సిరి ఫ్రెండ్ షిప్ వల్లే చెడగొట్టుకున్న షణ్ముఖ్ తర్వాత అంటే బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక సిరి ఫ్రెండ్ షిప్ ని కూడా మెయింటింగ్ చెయ్యడం లేదు. అయితే దీప్తి సునయన తన కెరీర్ లో బిజీ అవ్వగా.. షణ్ముఖ్ యూట్యూబ్ వీడియోస్ అలాగే వెబ్ సీరీస్ లు స్పెషల్ సాంగ్స్ తో బాగా హైలెట్ అయ్యాడు. దీప్తి బ్రేకప్ తర్వాత సింగిల్ గా ఉంటున్న షణ్ముఖ్.. మళ్ళీ ప్రేమలో పడ్డాడా అన్నట్లుగా యూట్యూబ్ నటి ఫణి పూజితతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఫణి పూజితతో కలిసి యూట్యూబ్ వీడియోలు తీస్తున్నాడు. వీరి రొమాంటిక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దానితో ఈ జంట మధ్యన సం థింగ్ సం థింగ్ అంటున్నారు.
రీసెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ ఫణి పూజిత కలిసి చేసిన యూట్యూబ్ సాంగ్ నెట్టింట ట్రెండ్ అయ్యింది. ఈ పాటలో షణ్ముఖ్- ఫణి పూజిత ఇద్దరూ రొమాంటిక్ గా రెచ్చిపోయారు. షణ్ముఖ్ ఆమెను ముద్దుపెట్టుకోవడం, గట్టిగా కౌగిలించుకోవడం లాంటి ఘాటు రొమాన్స్ పండించాడు. దానితో షణ్ముఖ్ మళ్ళీ ప్రేమలో పడ్డాడు అని ప్రచారం జరుగుతుండగా.. నెటిజెన్స్ మాత్రం బాబోయ్ షణ్ముఖ్ నువ్వు మాములోడివి కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.