సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా.. ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి చిన్న పిల్లాడిలా మారిపోతారు. తన పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తారు. మహేష్ కుమార్తె సితార అయితే తండ్రి అందం, తల్లితండ్రుల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది. చదువులోనే కాదు.. ట్రెడిషనల్ గాను, అలాగే కూచిపూడి డాన్స్, మోడ్రన్ స్టెప్స్ తో మంచి ప్రావీణ్యం పొందింది.
కూతురి చేసే ప్రతి పనిని నమ్రత, మహేష్ లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతారు. తాజాగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సితార పిక్ ని షేర్ చేసింది నమ్రత. అందులో సితార ఎంత క్యూట్ గా ఉందొ మాటల్లో వర్ణించడం చాలా కష్టం, లంగా వోణిలో పదహారణాల తెలుగమ్మాయిలా, బుట్టబొమ్మలా మెరిసిపోయింది. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచులులా సితార క్యూట్ నెస్ ని పొగిడేస్తున్నారు నెటిజెన్స్. ఆ పిక్స్ లో బ్యాగ్ రౌండ్ లో పూల డెకరేషన్ తో ఉండగా సితార చిలకపచ్చ వోణిలో ఎల్లో లెహంగాలో ఇచ్చిన స్మైల్ కి ఫిదా అవ్వాల్సిందే.
ఇక గత వారమే తల్లి నమ్రతతో కలిసి సితార పారిస్ ట్రిప్ వెళ్ళింది. స్కూల్ కి హాలిడేస్ రావడంతో సితార తల్లితో కలిసి వెకేషన్స్ కి వెళ్ళింది. ఈసారి మహేష్ అలాగే ఆయన తనయుడు గౌతమ్ లు కాస్త బిజీ షెడ్యూల్స్ వలన ఈ వెకేషన్స్ లో మిస్ అయినట్లుగా తెలుస్తుంది.