Advertisementt

లుక్స్ విషయంలో ఆయన టాప్-ఈయన వీక్

Wed 22nd Mar 2023 09:02 PM
balakrishna,nbk108,chiranjeevi,bhola shankar  లుక్స్ విషయంలో ఆయన టాప్-ఈయన వీక్
Balakrishna vs Chiranjeevi లుక్స్ విషయంలో ఆయన టాప్-ఈయన వీక్
Advertisement
Ads by CJ

గత కొన్నాళ్లుగా లుక్స్ విషయంలో నందమూరి బాలకృష్ణని ఆయన అభిమానులే కాదు.. సాధారణ సినిమా ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఆయన హెయిర్ స్టైల్, అలాగే కాస్ట్యూమ్స్ మీద ఆయన ఫాన్స్ కే కంప్లైంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు నందమూరి ఫాన్స్ ని అడుగడుగునా బాలకృష్ణ ఇంప్రెస్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాల్లోనూ ఆయన ఏజ్ కి తగ్గ పాత్రలని ఎంచుకుంటూ కిక్ ఇస్తున్నారు. 

అఖండ, వీర సింహ రెడ్డి ఇలా సినిమాల్లో, ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలోను, అలాగే ఈమధ్యన ఇండియన్ ఐడల్ 2 షో లో బాలకృష్ణ లుక్స్, ఆయన ఎనర్జీకి అందరూ ఫిదానే అవుతున్నారు. అలా బాలయ్య కేరెక్టర్స్, లుక్ పై ఫాన్స్ అయితే ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

కానీ మరో వైపు మెగాస్టార్ లుక్స్ విషయంలో మెగా ఫాన్స్ మధనపడుతున్నారు. ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటినుండి మెగాస్టార్ ఒక్కోసారి లావుగా, ఒక్కోసారి సన్నగా కనిపించినా ఒప్పుకున్నారు. కానీ ఆయన మేకప్ విషయంలోనూ, కొన్ని లుక్స్ విషయంలోనూ మెగా ఫాన్స్ చెప్పుకోలేని ఇబ్బంది పడుతున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య ఇలా ప్రతి సినిమాలోనూ ఆయనని యంగ్ గా చూపించడానికి దర్శకులు నానా రకాలుగా ట్రై చేశారు. 

భోళా శంకర్ ఫస్ట్ లుక్ లో చిరూని సూపర్ గా చూపించిన మెహ రమేష్.. ఉగాది లుక్ విషయంలో మెగాస్టార్ ని కొద్దిగా యంగ్ గా చూపించడానికి ట్రై చేసారు. ఆ లుక్ చూసిన మెగా ఫాన్స్ పెదవి విరుస్తున్నారు. కీర్తి సురేష్-తమన్నా కూర్చున్న సోఫా వెనుక నిలబడిన చిరూని చూసి అమ్మో మెహర్.. ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్స్ చేసి.. ఇప్పుడేమిటి ఇలా చేసావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి లుక్ విషయంలో నందమూరి బాలకృష్ణ టాప్ లో ఉంటే.. అదే ఏజ్ లో ఉన్న మెగాస్టార్ లుక్, స్టైల్ విషయంలో వీకైపోతున్నారు.. అనే అభిప్రాయాలను నెటిజెన్స్ వ్యక్తపరుస్తున్నారు.

Balakrishna vs Chiranjeevi :

Balakrishna NBK108 vs Chiranjeevi Bhola Shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ