Advertisementt

ఓటిటిలోకి వచ్చేస్తున్న బలగం

Thu 23rd Mar 2023 07:52 PM
balagam movie,amazon prime  ఓటిటిలోకి వచ్చేస్తున్న బలగం
Balagam coming into OTT ఓటిటిలోకి వచ్చేస్తున్న బలగం
Advertisement
Ads by CJ

దిల్ రాజు నిర్మాణంలో జబర్దస్త్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. దిల్ రాజు వారసులు హర్షిత్, హర్షిత నిర్మించిన ఈ లో బడ్జెట్ మూవీకి వారు చేసిన ప్రమోషన్స్, అలాగే సినిమాలో బలమైన కంటెంట్ ఉన్న కారణంగా థియేటర్స్ లో ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసారు ఆడియన్స్. చిన్న సినిమాగా బోలెడన్ని కలెక్షన్స్ తెచ్చిపెట్టిన బలగం దిల్ రాజు వారసులని లాభాల బాట పట్టించింది. 

2.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 20 రోజుల్లో 20 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బలగం చిత్రం ఇప్పుడు 20 రోజుల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తుంది. మార్చ్ 24 అంటే ఈరోజు అర్ధరాత్రి నుండే బలగం చిత్రం అమెజాన్ ప్రైమ్ తో పాటుగా.. సింప్లి సౌత్ ఓటిటీలలో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. అంటే మరికొన్ని గంటల్లో బలగం ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. 

థియేటర్స్ లో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూసినంతసేపు లేదు.. బలగం ఓటిటిలోకి రావడానికి. మరి అక్కడ మిస్ అయిన వారంతా ఇప్పుడు బలగాన్ని ఓటిటిలో చూసేందుకు రెడీ అయిపోండి.

Balagam coming into OTT:

Balagam Movie To Stream In Amazon Prime From Tonight

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ