Advertisementt

నరేష్ - పవిత్ర పెళ్లిలో ట్విస్ట్

Fri 24th Mar 2023 01:46 PM
naresh,pavitra,malli pelli  నరేష్ - పవిత్ర పెళ్లిలో ట్విస్ట్
Naresh - Pavitra Lokesh Matured Love Story Titled Malli Pelli నరేష్ - పవిత్ర పెళ్లిలో ట్విస్ట్
Advertisement
Ads by CJ

ఒకరోజు ఉన్నట్టుండి సినిమా స్టయిల్లో సీనియర్ నరేష్ తాను పవిత్రని పెళ్లి చేసుకుంటున్నట్టుగా, ఏడడుగులు నడిచిన ఓ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ వీడియో ని పోస్ట్ చేసిన తర్వాత నరేష్-పవిత్ర లోకేష్ లు దుబాయ్ కి వెళ్లడంతో.. వీరికి పెళ్లయిపోయింది.. ఇద్దరూ కలిసి దుబాయ్ కి హనీమూన్ కి వెళ్లారనే ప్రచారం జరిగింది. నిజంగానే నరేష్-పవిత్రలు ఎప్పటినుండో కలిసే ఉంటున్నారు. న్యూ ఇయర్ రోజున పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ రొమాంటిక్ వీడియోతో స్పష్టం చేసారు. 

మూడో భార్య రమ్య తో విడాకులు అవ్వగానే పవిత్రతో నరేష్ పెళ్లి పీటలెక్కడానికి సిద్ధంగా ఉండడంతో.. నరేష్ పెళ్లి వీడియో చూసి నిజమే నరేష్-పవిత్ర పెళ్లి చేసుకున్నారనే అనుకున్నారు. కానీ నరేష్-పవిత్ర లోకేష్ పెళ్ళిలో అసలు ట్విస్ట్ రివీల్ అయ్యింది. వారి పెళ్లి జస్ట్ సినిమా కోసం జరిగిన పెళ్లి, అంటే రీల్ పెళ్లన్నమాట. నరేష్-పవిత్రలు కీలక పాత్రల్లో మళ్ళీ పెళ్లి సినిమా తెరకెక్కుతుంది. ఆ సినిమా కోసమే నరేష్-పవిత్రలు పెళ్లి పీటలెక్కారు.

సో ఆ పెళ్లి పబ్లిసిటీ స్టంట్ అన్నమాట. నరేష్-పవిత్ర ల మళ్ళీ పెళ్లి వేసవి కానుకగా విడుదల కాబోతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. నరేష్ పెళ్లి ని కూడా ఇలా పబ్లిసిటీ చేసేసాడు. రీల్ పెళ్లిని రియల్ పెళ్లిగా కలరింగ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేశాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Naresh - Pavitra Lokesh Matured Love Story Titled Malli Pelli:

Naresh - Pavitra Malli Pelli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ