రకుల్ ప్రీత్ ఈమధ్యన సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తుంది. తెలుగులో ఆల్మోస్ట్ రకుల్ ప్రీత్ కి డోర్స్ క్లోజ్ అయినా.. గ్లామర్ ఫొటోస్ తో ఏమైనా ఆఫర్స్ దొరుకుతాయేమో అని ఆశగా ఎదురు చూస్తుంది. సౌత్ లో కేవలం కమల్ హాసన్ తో శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 లో మాత్రమే నటిస్తున్న రకుల్ ప్రీత్ కి అందులో సెకండ్ హీరోయిన్ కేరెక్టర్ తగిలించింది. ఈ చిత్రంలోనూ రకుల్ అందాల ఆరబోతతోనే హైలెట్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇక బాలీవుడ్ మూవీస్ కోసం బాగా బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యింది కానీ.. ఆ ప్రాసెస్ లో రకుల్ అందమైన మొహాన్ని, ఆకర్షణని కోల్పోయింది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇక జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్న రకుల్ ని పెళ్ళెప్పుడు అంటే ఇంతెత్తున లేస్తుంది. నా పెళ్లి గురించి మీకెందుకు అంటుంది. ఇక ఈమధ్యన ఫ్యామిలీ వెడ్డింగ్స్, ఫ్రెండ్స్ వెడ్డింగ్ అంటూ హడావిడి చేస్తుంది. గత ఏడాది పంజాబీ స్టయిల్లో ఫ్రెండ్ వెడ్డింగ్ లో అదరగొట్టేసిన రకుల్ తాజాగా ఫ్యామిలీ వెడ్డింగ్ లో సందడి చేసింది.
గ్రీన్ కలర్ మోడరన్ డిజైనర్ డ్రెస్ లో మెరిసిపోతూ ఫొటోలకి ఫోజులిచ్చిన రకుల్.. ఆ డ్రెస్ లో చాలా అంటే చాలా అందంగా కనిపించింది. ఆ ఫొటోస్ తో పాటుగా.. Naach gaana and bling #familywedding అంటూ క్యాప్షన్ పెట్టింది.