కేరెక్టర్ ఆర్టిస్ట్ గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గత ఎన్నికల సమయంలో వైసిపి పార్టీ కండువా కప్పుకుని.. తర్వాత వైసిపి నుండి గెంటివేయబడి.. ప్రస్తుతం సినిమాలే దిక్కు అన్నట్టుగా మెగా ఫ్యామిలీ భజన చేస్తూ.. మధ్యలో పర్సనల్ ప్రోబ్లెంస్ తో న్యూస్ లో నిలిచాడు. ప్రస్తుతం రాజకీయాలకి రామ్ రామ్ అంటున్నా మరోవైపు జనసేన వైపు చూస్తున్న పృథ్వి.. జబర్దస్థ్ షోకి రావొచ్చనే కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. జబర్దస్త్ ద్వారా నాగబాబు, రోజా లకి పేరు కి పేరు, డబ్బుకి డబ్బు ఎలా వచ్చిందో అందరికి తెలుసు. అలాంటి జబర్దస్త్ లోకి వెళ్ళొచ్చేమో అంటూ పృథ్వి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాజాగా 30 ఇయర్స్ పృథ్వి యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తున్నాడు. పదేళ్లపాటు సమయాన్ని వృధా చేసుకుని రాజకీయాల్లో తిరిగాను, ఇప్పుడు బాగా బుద్దొచ్చింది. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్నాను, జనసేన నుండి అవకాశం వస్తే పోటీ చేస్తాను అన్న పృథ్వి.. తాను కోవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వైసిపి వాళ్ళు కనీసం హాస్పిటల్‌లో బెడ్ ఇప్పించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.
కానీ నాగబాబు తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పి హాస్పిటల్‌లో బెడ్ ఏర్పాటుచేశారని, మంచి సినిమా కుటుంబాన్ని వదిలిపెట్టి వైసీపీలోకి వెళ్లి తప్పుచేశానని ఆరోజే అనిపించిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం ఎప్పుడైనా అవకాశం వస్తే టివి షోస్ కి వెళుతున్న, ఈమధ్యనే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉగాది ప్రోగ్రాం చేశాను, తర్వాత జబర్దస్త్ కి కూడా వెళ్ళొచ్చేమో అంటూ అందరిలో ఆశక్తి రేపాడు.