మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్ర టైటిల్‌ను.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’గా టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో ఇన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్‌పై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయింది. అయితే ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఆ సర్‌ప్రైజ్ మధ్యాహ్నం 3గంటల 06 నిమిషాలకు విడుదల చేయనున్నారు. బహుశా అది.. ఈ సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ అని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన టైటిల్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ టైటిల్ రివీలింగ్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఆదివారం అభిమానుల సమక్షంలో జరిగిన వేడుకకు నిర్మాత దిల్ రాజు హాజరవడమే కాకుండా.. RC 15 టైటిల్‌కు సంబంధించి నాలుగు ఆప్షన్స్‌తో ఓ మల్టీపుల్ చాయిస్ ప్రశ్నను అభిమానులకు సంధించారు. అందులో ఆప్షన్ A. సర్కారోడు, B. సీఈఓ C. గేమ్ ఛేంజర్ D. అది మాత్రం సస్పెన్స్! అంటూ స్టేజ్‌పై దిల్ రాజు పిచ్చ హ్యాపీగా చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటి వరకు వినిపించిన ఈ మూడు టైటిల్స్ కాదనేలా టాక్ మొదలైంది. తాజాగా ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేసింది. దిల్ రాజు చెప్పిన ఆప్షన్ C నే ఈ సినిమా టైటిల్‌గా రివీల్ చేశారు. ఈ సంస్థకు ఇది 50వ చిత్రం.
‘వినయ విధేయ రామ’ చిత్రం తర్వాత మరోసారి రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్, కియారాపై ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఈ పాటకు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మాస్టర్ నృత్య రీతుల్ని సమకూర్చారు. ఈ పాట పూర్తయిన సందర్భంగానే యూనిట్ మొత్తం ఆర్సీ 15సెట్లో రామ్‌చరణ్ పుట్టినరోజు వేడుకలను వైభవంగా జరిపింది. అంతకు ముందు ఆస్కార్ నుంచి వచ్చిన చరణ్‌కు దాదాపు 500 డ్యాన్సర్స్‌తో ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేస్తూ యూనిట్ గ్రాండ్ వెల్‌కమ్ పలికింది.