Advertisementt

మెగా డాటర్ నిహారిక కొత్త లుక్

Mon 27th Mar 2023 05:14 PM
niharika,niharika latest look  మెగా డాటర్ నిహారిక కొత్త లుక్
Mega Daughter Niharika latest look మెగా డాటర్ నిహారిక కొత్త లుక్
Advertisement
Ads by CJ

మెగా డాటర్ నిహారిక ఎప్పుడూ సంచలనమే. మెగాస్టార్ చిరంజీవి డాటర్స్ సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్ గా స్క్రీన్ వెనకే ఉంది. శ్రీజ సినిమాల విషయంలో అంత పట్టించుకోదు. ఇక నిహారిక యాంకర్ గాను, వెబ్ సీరీస్, సినిమాలతో ఏదో విధంగా స్క్రీన్ మీదే కనిపిస్తుంది. చైతన్య తో వివాహం తరవాత సోషల్ మీడియాలో పర్సనల్ ఫొటోస్ తోనూ చెలరేగిపోయిన నిహారిక.. కొన్నాళ్లుగా భర్తకి దూరంగా ఉంటుంది, చైతన్యతో విడాకులకు సిద్ధమవుతుంది అంటూ గత వారం రోజులుగా వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

కారణం భార్య-భర్త ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడం, వాళ్ళు కలిసున్న ఫొటోస్ డిలేట్ చెయ్యడంతో ఇద్దరూ విడిపోతున్నారనే అనుమానం అందరిలో మొదలయ్యింది. అయితే నిహారిక ఈ విడాకుల మ్యాటర్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్న సమయంలోనే.. ఆమె నటించిన వెబ్ సీరీస్ పై ట్వీట్ చేసింది. ఆ సీరీస్ ప్రమోషన్స్ లో నిహారిక హడావిడి మొదలు పెట్టబోతోంది. అయితే విడాకుల విషయం తర్వాత నిహారిక ఏమైనా ఈ విషయమై స్పందిస్తుందేమో అని చాలామంది వెయిట్ చేస్తున్నారు.

కానీ ఆమె ఆ విషయం పక్కనబెట్టి తాజాగా కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ లో సారీ కట్టుకుని సరికొత్త లుక్ లో కొత్తగా కనిపించింది. ఆ లుక్ లో నిహారిక ముక్కెర పెట్టుకుని, చక్కగా జడ వేసుకుని రెడ్ సారీ లో అచ్చమైన తెలుగు ఆడపడుచులా ఆకర్షనీయంగా కనిపించింది. ఆమె అందాన్ని ఎంతగా పొగుడుతున్నా.. ఆమె విడాకుల విషయమై మాత్రం క్లారిటీ రక నెటిజెన్స్ తెగ ఆలోచించేస్తున్నారు.

Mega Daughter Niharika latest look :

Niharika latest saree look goes look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ