అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి ఇద్దరు పిల్లలు పుట్టినా నాజూగ్గా, సన్నగా గ్లామర్ గా మెరిసిపోతుంది. ఒక్కోసారి హీరోయిన్స్ కి కూడా సాధ్యం కాదేమో అన్న ఫిట్ నెస్ తో స్నేహ రెడ్డి గ్లామర్ షో చేస్తుంది. బన్నీతో కలిసి మాత్రమే కాదు.. స్పెషల్ ఫోటో షూట్స్ తో హీరోయిన్స్ కి మించి అందాలు ఆరబోసే స్నేహ రెడ్డి అసలు అందానికి, ఫిట్ నెస్ కి వెనుక ఉన్న రహస్యమేమిటో తెలిసిపోయింది. స్నేహ రెడ్డి పాజిటివ్ దృక్పధంతో ఇంట్లో భర్త, పిల్లల బాధ్యతలు నిర్వహిస్తూనే తన ప్రత్యేకతని చాటుకుంటుంది.
ఇక ఈరోజు స్నేహ రెడ్డి తన ఫిట్ నెస్ వెనకున్న రహస్యాన్ని విప్పింది. అదే ఆమె రోజు పొద్దునే లేచి యోగ చేస్తుంది. తన ఫిట్ నెస్ వీడియోతో పాటు.. సన్నగా ఉండడం ఫిట్‌గా ఉండడం రెండూ ఒకటి కాదు. ఫిట్‌నెస్ అనేది అటు శారీరక, మానసిక, ఇటు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంబంధించినది. 2023 లో నేను నా ఫిట్‌నెస్ జర్నీని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాను.. అంటూ ఇన్స్టాలో తన అందం వెనుక రహస్యాన్ని షేర్ చేసింది.
ఇంకా ఆ వీడియోలో స్నేహ బుక్ చదువుతూ రిలాక్స్ అవుతుంది. ఇక ఇన్స్టాలో భర్తకి సంబందించిన, పిల్లలు ఆయన్ అర్హలకి సంబందించిన వీడియోస్ ని షేర్ చేసే స్నేహ రెడ్డికి ఇన్స్టాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. టాప్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్ అనుకునేరు. అంతకు మించి సోషల్ మీడియాలో బన్నీ వైఫ్ స్నేహని అభిమానించేవారు ఉన్నారు.