Advertisementt

కొంటె చూపులతో మత్తెక్కిస్తున్న రష్మిక

Tue 28th Mar 2023 01:04 PM
rashmika mandanna,bollywodo hungama  కొంటె చూపులతో మత్తెక్కిస్తున్న రష్మిక
Rashmika is intoxicating with mischievous looks కొంటె చూపులతో మత్తెక్కిస్తున్న రష్మిక
Advertisement
Ads by CJ

రష్మిక మందన్నకి సౌత్ లో సినిమాలు లేవు.. ఒక్క పాన్ ఇండియా పుష్ప ద రూల్ తప్ప.. ఇక అమ్మడు బాలీవుడ్ నే నమ్ముకోవాలేమో అనుకున్నారు. కానీ రశ్మికని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుములు మరోసారి నితిన్ సినిమాలో హీరోయిన్ రిపీట్ చేస్తూ అనౌన్స్ చేసాడు. దానితో తెలుగులో మరో సినిమా రష్మిక చేతుల్లోకి వచ్చేసింది. ఇక బాలీవుడ్ పై భీభత్సమైన ఆశలు పెట్టుకున్న రశ్మికకి ఇప్పటివరకు అక్కడ ఓ అనుకున్నంత హిట్ అయితే రాలేదు. ఆమె నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలు సో సో ఫలితాన్నే ఇచ్చాయి.

ప్రస్తుతం సందీప్ వంగ-రణబీర్ కపూర్ యానిమల్ పై నమ్మకం పెట్టుకున్న రష్మిక గ్లామర్ విషయంలో తగ్గేదెలా అంటుంది. బాలీవుడ్ కి వెళ్లకముందే రష్మిక మందన్న గ్లామర్ విషయంలో ప్రత్యేకతని చూపిస్తూ వచ్చింది. గ్లామర్ గా అందాలు ఆరబోసే విషయంలో, ఆమె అవుట్ ఫిట్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా రష్మిక డ్రెస్ సెన్స్ ఉంటుంది. అయితే ఈమధ్యన జీ సినిమా అవార్డ్స్ లో పుష్ప చిత్రంలో సామి సామి సాంగ్ కి అదిరిపోయే డాన్స్ స్టెప్స్ వేసిన రష్మిక.. ఇప్పుడు మరో అవార్డ్స్ వేడుకలో గ్లామర్ గా కనిపించింది.

బాలీవుడ్ హంగామా అవార్డ్స్ వేడుకలో కొంటె చూపులతో మత్తెక్కిస్తూ.. గ్లామర్ గా కనిపిస్తున్న పిక్స్ షేర్ చేసింది. ఆ పిక్స్ తో పాటుగా This is what I wore for #BollywoodHungama awards.. was it ok? 🐒🖤🤍 అంటూ రాసుకొచ్చింది.

Rashmika is intoxicating with mischievous looks:

Rashmika Mandanna new glamour look in Bollywodo Hungama awards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ