Advertisementt

వేణుస్వామి చుట్టూ తిరుగుతున్న హీరోయిన్లు

Tue 28th Mar 2023 05:29 PM
venu swamy,nidhi agarwal  వేణుస్వామి చుట్టూ తిరుగుతున్న హీరోయిన్లు
Venu Swamy Special Pooja At Nidhi Agarwal Hous వేణుస్వామి చుట్టూ తిరుగుతున్న హీరోయిన్లు
Advertisement
Ads by CJ

లక్కు బావుండాలె కానీ.. వచ్చే అవకాశాలను ఎవ్వరు ఆపగలరు. గ్లామర్ గా అందాలు ఆరబోసిన కొంతమందికి అదృష్టం కలిసిరాక.. కొన్ని సినిమాల తర్వాత ఇండస్ట్రీ నుండి మాయమైపోతే.. కొంతమంది స్టార్ హీరోల అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కొంతమంది మాత్రం దేవుణ్ణి నమ్ముతారు. కొంతమంది జాతకాలని. ఈమధ్యన టాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఆస్ట్రాలజర్ వేణు స్వామి చుట్టూ తిరుగుతూన్నారు. 

కొంతమంది విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకాలు నిజమవడంతో.. దానితో ఆయన చుట్టూ చాలామందే ప్రదక్షణలు చేస్తున్నారు. మొన్నామధ్యన రష్మిక మందన్న వేణు స్వామి చేత హోమాలు గట్రా చేయించుకుంది. ఆయన పూజలు చేశాకే రష్మిక కెరీర్ బావుంది అంటూ చెప్పుకున్నారు కూడా. అందుకే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా వేణు స్వామి ఆధ్వర్యంలో సీక్రెట్ గా పూజలు చేయించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వేణు స్వామి పూజ చేయించిన హీరోయిన్ ఎవరో కాదు నిధి అగర్వాల్.

సవ్యసాచి, మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలేవీ నిధి అగర్వాలికి హెల్ప్ అవ్వలేదు. ఎంతగా అందాలు చూపించినా నిధికి స్టార్ ఛాన్సెస్ దక్కడమే లేదు. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లులో నటిస్తున్నా పాపని ఎవరూ పట్టించుకోవడమే లేదు. ప్రభాస్ తో మారుతి మూవీ చేస్తుంది అన్నా కన్ ఫర్మేషన్ లేదు. మరి ఈ జాతకాలు, పూజలు ఎమన్నా హెల్ప్ అవుతాయేమో అని నిధి నమ్మినట్టుంది. అందుకే ఇలా తన నెట్టింట పూజలు చేయిస్తుంది అంటున్నారు నెటిజెన్స్.

ఇది చూసాక.. పూజ చేయిస్తే చాన్సులు పెరుగుతాయి అని నమ్ముతున్న హీరోయిన్స్, వేణుస్వామి చుట్టూ తిరుగుతున్న హీరోయిన్లు, వేణుస్వామి భజన చేస్తున్న సెలబ్రిటీస్.. అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Venu Swamy Special Pooja At Nidhi Agarwal Hous:

Venu Swamy Special Puja @ Nidhi Agarwal House

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ