Advertisementt

నాని దసరా పబ్లిక్ టాక్

Thu 30th Mar 2023 07:54 AM
dasara public talk  నాని దసరా పబ్లిక్ టాక్
Nani Dasara Public Talk నాని దసరా పబ్లిక్ టాక్
Advertisement
Ads by CJ

సంక్రాంతి వెళ్ళాక బాక్సాఫీసు చిన్న సినిమాలతో సర్దుకుపోతుంది. గత రెండు నెలలుగా వారం వారం చిన్న చిన్న సినిమాలన్నీ జాతరని తలపిస్తున్నాయి. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే.. కొన్ని సోదిలోకి లేకుండా పోతున్నాయి. ఇక ప్రస్తుతం స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఫీవర్ కూడా ఆల్మోస్ట్ ముగిసిపోతుంది. ఇంటర్ ఎగ్జామ్స్ ఫినిష్ అవడంతో హీరో నాని శ్రీరామనవమి సందర్భంగా దసరాని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. శ్యామ్ సింగరాయ్ తో నాలుగు భాషల్లోకి వెళ్ళిన నాని.. ఇప్పుడు దసరాతో హిందీని టచ్ చేసాడు. నాని దసరా సినిమాతో ఈరోజు నార్త్ ఆడియన్స్ ని పలకరించేసాడు.

సింహం సింగిల్ గా వస్తుంది అంటూ సోలో ప్రమోషన్స్ తో నాని సినిమాపై అంచనాలు క్రియేట్ చేసారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నటి కీర్తి సురేష్ వీలున్నప్పుడల్లా నానితో జాయిన్ అవుతూ ప్రమోషన్స్ చేసినా.. నాని ఒక్కడే దసరా ప్రమోషన్స్ బాధ్యత చూసుకుంటూ గత రెండు నెలలుగా పబ్లిక్ లోనే ఉన్నాడు. ఇక నేడు గురువారం మార్చ్ 30న ఆడియన్స్ ముందుకు వచ్చిన నాని దసరా ఎలా ఉందో.. అప్పుడే ఓవర్సీస్ టాక్, ట్విట్టర్ టాక్, పబ్లిక్ రివ్యూస్ తో సోషల్ మీడియాలో హడావిడి స్టార్ట్ అయ్యింది.

#Dasara Overall A Pretty Decent Raw and Rustic Village Drama! నాని అన్న మాస్ బ్యాటింగ్ మామూలుగా లేదు.. రూ.100 కోట్లు లోడింగ్ అంటూ నాని ఫాన్స్ దసరా సినిమా చూసి థియేటర్స్ దగ్గర జాతర చేస్తున్నారు.థియేటర్స్‌లో నాన్ స్టాప్ విజిల్స్ పక్కా.. సినిమా చూసి ఇంకా ఓ ట్రాన్స్‌లో ఉండిపోయాను. నాని కెరీర్ బెస్ట్. ఈ చిత్రంతో నాని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, దసరా ముందు దసరా తర్వాత అనేంత గొప్పగా నటించారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ర్యాంప్. నాని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు.. అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

బాంచన్ నాని అన్న హిట్ కొట్టేసాడంటున్నారు. నాని అద్భుతంగా చేసాడు. దసరాలో నాని పెర్ఫామెన్స్ పీక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్‌కి హ్యాట్సాఫ్.. అంటూ పబ్లిక్ తమ ఒపీనియన్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Nani Dasara Public Talk:

Dasara Social Media Talk

Tags:   DASARA PUBLIC TALK
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ