Advertisementt

సౌత్ నెంబర్ 1 సూపర్ స్టార్ మహేషే

Thu 30th Mar 2023 10:28 AM
mahesh babu,social media  సౌత్ నెంబర్ 1 సూపర్ స్టార్ మహేషే
Mahesh Is First South Indian Hero సౌత్ నెంబర్ 1 సూపర్ స్టార్ మహేషే
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహెష్ బాబు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టకముందే ఆయన క్రేజ్ ఇప్పుడు బీభత్సంగా పెరిగిపోయింది. మహేష్ బాబు నుండి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఆయన ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ రికార్డులు సృష్టిస్తారు. టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ కి సోషల్ మీడియాలో ఏ హీరోకి లేనంతమంది ఫాన్స్ ఉన్నారు. పాన్ ఇండియా స్టార్స్ ని పక్కనబెట్టి మరీ సూపర్ స్టార్ మహేష్ ఆయన ఫాన్స్ సోషల్ మీడియాలో పట్టం కట్టారు. ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా ప్రతి ప్లాట్ ఫామ్ లో తనకున్న క్రేజ్ ని మహేష్ మరోసారి నిరూపించారు.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 లో నటిస్తున్నారు. మహేష్ బాబు నుండి అప్ డేట్ అనగానే ఆయన ఫాన్స్ అలెర్ట్ అవుతారు. ఇక మహేష్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వేశారు అంటే.. దానికి లైక్స్, రీ ట్వీట్స్ అంటూ అభిమానులు మోత మోగించేస్తారు. అయితే తాజాగా సోషల్ మీడియాలోని ఇన్స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ తో టాప్ స్థానంలో నిలిచారు మహేష్. కోటికి పైగా మహేష్ ని ఫాలో అవుతూ ఉండడంతో మహేష్ ఈ రికార్డ్ సాధించారు. సౌత్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ తో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్నారు. మూడు ప్లాట్ ఫార్మ్స్ లో కోటికి పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైన హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఫెస్టివల్స్ కి, ఫ్యామిలీ బర్త్ డే లకి, కూతురు సితార గురించి, తల్లి ఇందిరా గారు గురించి, భార్య నమ్రత గురించి తరచూ అభిమానులతో సోషల్ మీడియా ద్వారానే మహేష్ పంచుకుంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహేష్ ఇలా కోటిమంది ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసి సౌత్ నెంబర్ వన్ హీరోగా నిలవడం ఆయన ఫాన్స్ కి కిక్ ఇచ్చింది. 

ఈమధ్యనే SSMB28 ఫస్ట్ లుక్ తో మహేష్ ఇరక్కొట్టేశారు. అందులో ఆయన లుక్ కి విశేషమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

Mahesh Is First South Indian Hero:

Mahesh Babu Unique Record In Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ