Advertisementt

ఇదెక్కడి రియాలిటీ షో రా బాబు

Thu 30th Mar 2023 08:21 PM
manchu reality show  ఇదెక్కడి రియాలిటీ షో రా బాబు
House of Manchu Teaser ఇదెక్కడి రియాలిటీ షో రా బాబు
Advertisement
Ads by CJ

మంచు బ్రదర్స్ మధ్యన జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు రియల్ వారంటూ బజారున పడింది అనుకునేలా మంచు విష్ణు-మంచు మనోజ్ లు వ్యవహరించిన తీరుని మీడియా ఎండగట్టింది. ఎప్పుడు మా ఫ్యామిలీ మీదే ట్రోల్స్ చేస్తారా అంటూ మండి పడే మోహన్ బాబుని సైతం బిక్కసచ్చిపోయేలా చేసింది మొన్నటి ఘటన. మంచు విష్ణు సారధి ఇంటిపై గొడవ చేస్తున్న వీడియోని పబ్లిక్ కి లీక్ చేసిన మంచు మనోజ్ అన్నదమ్ముల మధ్యన అభిప్రాయభేదాలు కాదు.. పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది అనుకునేలా చేసాడు.

దాని తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో మంచు బ్రదర్స్ గొడవపై డిబేట్లు నడిచాయి. సీనియర్ జర్నలిస్ట్ లకి చేతినిండా పని దొరికినట్టుగా యూట్యూబ్ ఛానల్స్ కి మంచు ఫ్యామిలీ ఇంటర్వూస్ ఇస్తూ వాళ్ళు హడావిడి చేసారు. విష్ణు-మనోజ్ వ్యవహారంపై మోహన్ బాబు సీరియస్ అవడం అబ్బో ఇదంతా మంచు డ్రామాలానే నడిచింది. అయితే ఇప్పుడు అదంతా ఓ రియాలిటీ షో కోసం మంచు ఫ్యామిలీ ఇలాంటి సీన్ క్రియేట్ చేసిందా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కారణం మంచు విష్ణు ఈరోజు హౌస్ అఫ్ మంచు ఇండియా బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసాడు.

మంచు విష్ణు గొడవ పడుతున్న వీడియోతో పాటుగా.. ఆ వీడియో వలన మీడియాలో జరిగిన ఘటనపై జరిగిన డిబేట్స్ చూపించాక, నా పేరు మంచు విష్ణు అంటూ మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో నడుస్తున్న వీడియో, విష్ణు వర్కౌట్స్, కాలేజ్ స్టాఫ్ తో మీటింగ్, విద్యానికేతన్ స్కూల్, అలాగే మంచు మోహన్ బాబు గారి కోపం, వెరోనికా రియల్ లైఫ్, పిల్లల ఆటలు పాటలు, మోహన్ బాబు కట్టించిన సాయి బాబా టెంపుల్ ఇవన్నీ ఆ వీడియో లో చూపిస్తూ ఇదొక ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో హౌస్ అఫ్ మంచు అంటూ షాక్ ఇచ్చాడు మంచు విష్ణు. అయితే ఇదంతా మంచు ఫ్యామిలీ రియాలిటీ షోలో ఒక పార్ట్ అనేలా ఆ వీడియో ఉంది.

మరి మీడియాలో మంచు అన్నదమ్ముల మధ్యన జరిగిన గొడవంతా ఈ రియాలిటీ షోలో భాగమేనా.. ఇదంతా రియాలిటీ షో కోసమేనా.. ఇదేం రియాలిటీ షో రా బాబు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

House of Manchu Teaser:

 House of Manchu Reality Show promo goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ