రకుల్ ప్రీత్ తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ నుండి ఆఫర్స్ రావడంతో అక్కడికి జంప్ అయ్యాక బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగా టైట్ అవుట్ ఫిట్స్ తో అందాలు చూపించేస్తూ జిమ్ కి వెళుతూ ఉండేది. అంతకుముందు హైదరాబాద్ లో రకుల్ ప్రీత్ జిమ్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టీవ్ గా ఉండేది. కానీ రకుల్ జిమ్ లో కష్టపడిపోయి బరువు తగ్గించేసి అందం పోగొట్టుకుంది అనే విమర్శలు ఎదుర్కొంది.
తాను బరువు పెరిగినా, తగ్గినా విమర్శిస్తున్నారంటూ అప్పటినుండి ఆమె వర్కౌట్ వీడియోస్ ని షేర్ చెయ్యడం మానేసి.. గ్లామర్ గా అందాలు ఆరబోస్తున్న పిక్స్ వదులుతుంది. సోషల్ మీడియాలో ట్రెడిషనల్, మోడరన్ అవుట్ ఫిట్స్ తో ఎప్పటికప్పుడు ఫొటోస్ రిలీజ్ చేస్తుంది. ఎన్ని చేసినా రకుల్ కి తెలుగు లో ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు.
అయితే ఫ్యామిలీ వెడ్డింగ్స్, ఫ్రెండ్స్ వెడ్డింగ్స్ లో సందడి చేస్తున్న ఆమె మరోసారి జిమ్ వీడియోస్ వైపు టర్న్ అయ్యింది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా హీరోయిన్స్ అంతా ట్రెడిషనల్ గా నవమి శుభాకాంక్షలు తెలియజేస్తే.. రకుల్ మాత్రం అందాలు ఆరబోస్తూ టైట్ ఫిట్ లో ఫిగర్ ని చూపిస్తూ వదిలిన వర్కౌట్ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ ఫిట్ నెస్ వీడియో చూసిన నెటిజెన్స్ అబ్బో రకుల్ మళ్ళీ పెట్టిందిగా అంటున్నారు.