చాలామంది తల్లితండ్రులు నటనవైపు వెళతామంటే అస్సలు ఒప్పుకోరు. అదే అబ్బాయిలైతే ఏదో అదృష్టాన్నిఆ పరీక్షించుకుంటారు.. సెటిల్ అయితే ఓకె.. లేదంటే ఏదైనా జాబ్ చేసుకుంటారు అనుకుంటారు. కానీ.. అమ్మాయిలైతే మాత్రం పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. నటించడం వరకు ఓకె.. కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో కొంతమంది అనుభవాలు పాటలు నేర్పుతాయి. మరికొంతమందికి రెడ్ కార్పెట్ పరిచేవాళ్ళు ఉంటారు. అయితే తాజాగా తాను సినిమాల్లో నటించడం మా పేరెంట్స్ కి ఇష్టం లేదు అంటూ సీతారామం బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది.
మోడలింగ్ నుండి సీరియల్స్ లోకి వచ్చి.. అక్కడ సక్సెస్ అయ్యి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ తో వెలిగిపోతున్న మృణాల్ ఠాకూర్ కి సీతారామం బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది. ఈమధ్యన ఓ ఈవెంట్ లో మృణాల్ మట్లాడుతూ.. మాది మరాఠీ ఫ్యామిలీ .. నేను నటనని ఎంచుకోవడం, నటన వైపు రావడం మా పేరెంట్స్ కి ఎంత మాత్రం ఇష్టం లేదు. వాళ్ళకి టివి, సినిమా ఇండస్ట్రీల గురించి పెద్దగా తెలియకపోవడమే అందుకు కారణం. అందువల్లనే నా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేయలేకపోయారు.
మొదట్లో నేను టీవీ సీరియల్స్ లో నటించాను. టివిలో వచ్చిన గుర్తింపు నన్ను బిగ్ స్క్రీన్ వైపు తీసుకుని వెళ్లింది. సినిమాల్లోకి వచ్చాక ఇక్కడ నేను ఎంచుకున్న కథలు, కేరెక్టర్స్ నాకు మంచి పేరును తీసుకుని వస్తున్నాయి. ఒకప్పుడు సపోర్ట్ చెయ్యడానికే ఇష్టపడని నా పేరెంట్స్ ఇప్పుడు నా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది.