Advertisementt

అనూకి మరో హిట్ దక్కేనా?

Fri 31st Mar 2023 05:10 PM
ravanasura help anu emmanuel  అనూకి మరో హిట్ దక్కేనా?
Will Anu Emmanuel got another hit? అనూకి మరో హిట్ దక్కేనా?
Advertisement
Ads by CJ

అని ఇమ్మాన్యువల్ టైం అస్సలు బాగోలేదు. అను ఇమ్మాన్యువల్ కి టాలీవుడ్ లో వచ్చిన వరస షాక్ లతో అవకాశాలు లేకుండా పోయాయి. గ్లామర్ గా అందాలు ఆరబోసినా, స్టార్ ఛాన్సెస్ వచ్చినా అనుకి అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. మహాసముద్రం దెబ్బకి అను ఇమ్మాన్యువల్ ఇకపై తెలుగు తెరపై కనిపించదనే అనుకున్నారు. కానీ అమ్మడుకి మెగా హీరో అల్లు శిరీష్ సరసన ఉర్వశివో రాక్షసీవో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో బోల్డ్ గా అను ఇమ్మాన్యువల్ మెప్పించింది. అలాగే ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యింది.

ఆ తర్వాత అను ఇమ్మాన్యువల్ రేంజ్ మారిపోతుంది. అనుకి టాలీవుడ్ యంగ్ హీరోలు ఛాన్స్ లు ఇచ్చేస్తారనే ప్రచారం గట్టిగానే జరిగింది. కానీ అను ఇమ్మన్యువల్ ని పట్టించుకున్న తెలుగు దర్శకులు, హీరోలు లేరు. కానీ రవితేజ తన సినిమాలో ఓ రోల్ ఇచ్చాడు. రావణాసురలో ఫారియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లతో అను ఇమ్మన్యువల్ స్క్రీన్స్ షేర్ చేసుకుంది. మరి ఆమె రోల్ నిడివి ఎంతుందో.. ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ రావణాసుర హిట్ అయ్యింది అంటే ఆ సక్సెస్ ని అను ఇమ్మన్యువల్ పంచుకుంటుంది. ముగ్గురు హీరోయిన్స్ లో ఒక్కరు అయినా.. సక్సెస్ జోష్ అందరికి అందుతుంది. మరి ఈ చిత్రం కూడా అనుకి హిట్ ఇస్తే.. ఆమెకి అవకాశాలు పెరుగుతాయి.. లేదంటే కష్టం. అన్నట్టు ఉర్వశివో హిట్ తర్వాత తమిళ్ హీరో కార్తీ తో సినిమా ఛాన్స్ తగిలింది పాపకి.

Will Anu Emmanuel got another hit?:

 Will Ravanasura help Anu Emmanuel?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ