Advertisementt

సూర్య తో లోకేష్ కనగరాజ్ ఫిక్స్

Sat 01st Apr 2023 06:35 PM
lokesh kanagaraj,suriya  సూర్య తో లోకేష్ కనగరాజ్ ఫిక్స్
Lokesh Kanagaraj With Suriya సూర్య తో లోకేష్ కనగరాజ్ ఫిక్స్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో గత ఏడాది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్-ఫహాద్ ఫాసిల్-విజయ్ సేతుపతి కలయికలో పాన్ ఇండియా మూవీగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన విక్రమ్ మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి ముఖ్య కారణం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. విక్రమ్ క్లైమాక్స్ లో సూర్య రోలెక్స్ గా చితకొట్టేశారు. విలన్ గెటప్ తోనే సినిమాని సక్సెస్ చేసారు. సూర్య రోలెక్స్ కేరెక్టర్ కి ఆయన అభిమానులే కాదు.. సినిమా లవర్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. అయితే అప్పటినుండి విక్రమ్ సీక్వెల్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. లోకేష్ కూడా విక్రమ్ సీక్వెల్ ఉండబోతుంది అని రోలెక్స్ కేరెక్టర్ తోనే హింట్ ఇచ్చాడు.

అయితే కమల్ హాసన్ విక్రమ్ సక్సెస్ అయినప్పుడే సూర్యని రోలెక్స్ వాచ్ తో అభినందించి.. రోలెక్స్ పాత్ర వల్ల మా సినిమా ఎక్కువ మందికి చేరువైంది, మేము అనుకోకుండా ఈ రోల్ కోసం చివరి నిమిషంలో సూర్యని సంప్రదించాము, ఆయన వెంటనే ఒప్పుకోవడంతోనే మా సినిమాకి మంచి పేరొచ్చింది అని. తాజాగా కమల్ హాసన్-సూర్య కలసి చెన్నైలో ఓ అవార్డ్స్ వేడుకలో సందడి చేసారు. ఆ వేడుకలో సూర్యకి అవార్డు అందిస్తూ మరోసారి రోలెక్స్ పాత్ర గురించి కమల్ మాట్లాడారు. ఈ పాత్ర చేయడానికి అంగీకరించినందుకు సూర్యకు మరోసారి ధన్యవాదాలు. ఒక్క ఫోన్ కాల్ తో సూర్య ఆ రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడంటూ.. సూర్య నుదుటున ముద్దాడిన పిక్ వైరల్ అయ్యింది. 

ఇక లోకేష్ కనగరాజ్, సూర్య కలిసి ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళతారా అని సూర్య అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సూర్య ఇతర దర్శకులతో, అలాగే లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం విజయ్ లియో మూవీ చేస్తున్నాడు. మరి సూర్యతో లోకేష్ మూవీపై లోకేష్ కనగరాజ్ ని అడగ్గా.. లోకేష్ కూడా ఇంట్రెస్టింగ్ గా సమాధానం చెప్పాడు. సూర్యతో సినిమా చేయాలని నాకు కూడా ఆసక్తి ఉంది. తప్పకుండా ఆయనతో మూవీ చేస్తా. ఆ చిత్రాన్ని 150 రోజుల్లోనే పూర్తి చేస్తాను అంటూ లోకేష్ సూర్య సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. 

Lokesh Kanagaraj With Suriya:

Lokesh Kanagaraj Announced A Film With Suriya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ