వరసగా ప్లాప్స్ ఎదురైనప్పుడు కొంతమంది హీరోలు కాస్త డిప్రెషన్ లోకి వెళ్లడం చూస్తుంటాము. మరికొంతమంది బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవుతారు. కొంతమంది తదుపరి ప్రాజెక్ట్ విషయంలో సుదీర్గమైన చర్చ చేస్తుంటారు. అయితే తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కొద్దిరోజులు సినిమాలకి గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. ఆయన నటించిన రెండు బిగ్ ప్రాజెక్ట్స్ విక్రాంత్ రోనా, కబ్జా రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వైఫల్యాన్ని మూటగట్టుకున్నాయి. సుదీప్ కబ్జాలో ఉపేంద్ర తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు కొద్దిగా సినిమాలకు విరామం తీసుకోబోతున్నట్టుగా ఈ హీరో సోషల్ మీడియాలో ప్రకటించాడు.
హాయ్ ఫ్రెండ్స్.. సుధీర్ 46 గురించి మీ ట్వీట్స్ అండ్ మీమ్స్ చూసి నవ్వొస్తుంది. అలా పిలిస్తే హ్యాపీ గా ఉంది.. దీనిపై మీకో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను, ప్రెజెంట్ నేను చిన్న విరామం తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇది నా ఫస్ట్ బ్రేక్. విక్రాంత్ రోనా, బిగ్ బాస్ సుదీర్ఘ విరామం తర్వాత ఇలా బ్రేక్ తీసుకుంటున్నాను, ఈ విరామాన్ని ఆనందంగా స్వాదిస్తూ ఎంజాయ్ చేస్తాను. క్రికెట్ అంటే చాలా ఇష్టం. అది నా లైఫ్ లో ఓ భాగం.
ఈమధ్యన కర్ణాటక బుల్డోజర్స్ తరపున CCL లో ఆడాను. ప్రస్తుతం సినిమాలకి సంబంధించి కూడా మూడు స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వాటిని ఓకె చేశాను. వాటిపై ఎవరీ డే వర్క్ జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్స్ విషయమై త్వరలోనే మీముందుకు వచ్చి అప్ డేట్స్ ఇస్తాను అంటూ సుదీప్ తాను సినిమాలకి బ్రేక్ ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేసాడు.