ప్రభాస్ ప్రెజెంట్ సలార్ షూటింగ్ లో ప్రశాంత్ నీల్ తో కలిసి ఇటలీ లో ఉన్నారు. సలార్ ఇటలీ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. సలార్ ఇటలీ షెడ్యూల్ ముగియగానే ఆయన హైదరాబాద్ కి వచ్చి మారుతీ మూవీ సెట్స్ లోకి జాయిన్ అవుతారని తెలుస్తుంది. రాజా డీలక్స్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ థియేటర్ సెట్ లో పూర్తి చేస్తున్న మారుతీ.. ఇప్పుడు ప్రభాస్ కోసం మరో సెట్ సిద్ధం చేస్తున్నాడట.
తాజాగా మొదలు కాబోయే కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో టెర్రస్ హౌజ్ సెట్ ని నెక్స్ట్ లెవెల్ అనేలా వేయించారట. థియేటర్ సెట్ నుండి కొత్త షెడ్యూల్ టెర్రస్ హౌజ్ సెట్ లోకి షిఫ్ట్ అవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఎక్కువ శాతం ఇండోర్ లోనే ప్లాన్ చేయడంతోనే ప్రభాస్ ఒప్పుకున్నారని అన్నారు. అలాగే చాలా తక్కువ డేట్స్ కేటాయించడం వలనే ప్రభాస్ త్వరగా మారుతికి కనెక్ట్ అయినట్లుగా కూడా వార్తలొచ్చాయి.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహన్ నటిస్తుంది. మిగతా ఇద్దరు హీరోయిన్స్ ఫైనల్ కావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మారుతి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈఏడాది మిడిల్ లో ఆదిపురుష్ రిలీజ్ అవుతుండగా.. సెప్టెంబర్ లో సలార్ విడుదలకి రెడీ అవుతుంది. 2024 జనవరిలో ప్రాజెక్ట్ K రెడీ అవుతుండడంతో మారుతి రాజా డీలక్స్ ని సమ్మర్ బరిలో దింపే ప్లాన్ చేస్తున్నాడట.