Advertisementt

హిట్ కొట్టాడు కారు పట్టాడు

Tue 04th Apr 2023 09:47 AM
srikanth odela  హిట్ కొట్టాడు కారు పట్టాడు
He hit and took the car హిట్ కొట్టాడు కారు పట్టాడు
Advertisement
Ads by CJ

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు.. ఇప్పుడు దానికి తగ్గ ప్రతి ఫలం గిఫ్ట్ రూపంలో అందుకున్నాడు. ఆయనే డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. దసరా స్క్రిప్ట్ తో హీరో నానిని మెప్పించి.. సినిమాని తెరకెక్కించి పాన్ ఇండియా స్టయిల్లో విడుదల చేసి హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెలకి నిర్మాత చెరుకూరి 80 లక్షల విలువైన BMW కారుని గిఫ్ట్ గా ఇచ్చిన విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే సినిమాలు హిట్ కొట్టాక దర్శకులకి ఇలాంటి బహుమతులు అందుతూనే ఉంటాయి. ఈమధ్యన కాలంలో ఇలాంటివి చాలానే చూస్తున్నాం.

గతంలో మారుతి, కొరటాల శివ ఇంకా కొంతమంది దర్శకులు ఇలాంటి గిఫ్ట్స్ అందుకున్నవారే. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి దసరా దర్శకుడు చేరాడు. నానిని మాస్ గా కాదు రా అండ్ రస్టిక్ గా చూపించి అద్భుతమైన హిట్ కొట్టాడు. దానితో తనకి ఇంత లాభాలు తెచ్చిన దర్శకుడిని నిర్మాత చెరుకూరి కారుతో సత్కరించాడు. దసరా చూసిన ప్రతి ఒక్కరూ పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. 

సూపర్ మహేష్ దగ్గర నుండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆస్కార్ రాజమౌళి, పుష్ప సుకుమార్ అందరూ దసరాకి పొగుడుతూ వేస్తున్న ట్వీట్స్ కి ప్రేక్షకుల్లో ఉత్సాహం ఎక్కువైపోతోంది. సెలబ్రిటీస్ విషెస్, దసరా కలెక్షన్స్ తో దసరా టీమ్, హీరోకి నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు.

He hit and took the car:

Producer Gifts Car To Srikanth Odela

Tags:   SRIKANTH ODELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ