వారం వారం కొత్త చిత్రాల ముచ్చట.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యే కొత్త కొత్త సినిమాలు, ఓటిటీలలోకి వచ్చే హిట్ మూవీస్ అబ్బో ప్రతి శుక్రవారం ఒకటే హడావిడి. గత వారం విడుదలైన దసరా మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో దున్నేస్తుంది. కలెక్షన్స్ పరంగా దసరా 100 కోట్ల మార్క్ కి దగ్గరలో ఉంది. ఇంకా నాని దసరా ప్రభంజనం జోరు థియేటర్స్ లో కొనసాగుతున్న సమయంలోనే రవితేజ రావణాసురుని వచ్చే శుక్రవారం అంటే ఏప్రిల్ 7 న రిలీజ్ చేసేందుకు సినిమాని తెగ ప్రమోట్ చేసేస్తున్నారు.
అలాగే వినరో భాగ్యము విష్ణు కథ వచ్చిన 50 రోజుల్లోనే మీటర్ అంటూ మాస్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నకిరణ్ అబ్బవరం కూడా తన సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు గట్టిగా కష్టపడుతున్నాడు. టాప్ తమిళ డైరెక్టర్ మురుగదాస్ ఆగష్టు 16 1947 చిత్రం కూడా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 7న విడుదలకు రెడీ అవుతుంది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ చిత్రాలు విడుదల కాబోతుండగా.. అదే ఏప్రిల్ 7న ఓటిటి నుండి కూడా ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సీరీస్ లు విడుదలవుతున్నాయి.
ఈ వారం ఓటిటీలలో విడుదలయ్యే చిత్రాల లిస్ట్
రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన అసలు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
మలయాళ హర్రర్ కామెడీ మూవీ రోమాంచం, క్రాసోవర్ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి రానున్నాయి.
అదితిరావు హైదరీ నటించిన జూబ్లీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
వీటితో పాటుగా తమిళ, మలయాళ, హిందీ వెబ్ సీరీస్ లు ఏప్రిల్ 7 నుండి అందుబాటులోకి రానున్నాయి